ఉద్ధవ్ ఠాక్రే కి సంజయ్ రౌత్ కి సిద్ధాంతాలు లేకపోవచ్చేమో గాని శివసైనికులు సిద్ధాంత బద్ధులే అన్నది ఋజువౌతూ వస్తుంది.

 

ఇప్పుడు బిజేపితో సాన్నిహిత్యాన్ని వదిలేసి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో చేతులు కలపటానికి వాళ్ళు ఏపిలోని టిడిపి పార్టీ కాదు. సిగ్గు నియమం మానం వదిలేయటానికి వాళ్ళు అదేదో సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాదు.

 

ఇప్పుడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పై పార్టీలోని సగానికి సగం మంది  ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే సమాచారం తీవ్రంగా వినిపిస్తుంది. అది నిజమే నని  సాక్షాత్తూ శివసేన వర్గాలు అంటున్నట్లు అభిఙ్జవగాల సమాచారం.

 

బీజేపీతో కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్‌ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతుండటంపై శివ సైనికులు తమ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించారు.

 

తమవద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన సంఖ్యాబలం లేదని, తమ మిత్రపక్షమైన శివసేన కూడా సహకరించడం లేదని బీజేపీ వ్యూహాత్మకంగా గవర్నర్‌కు తేల్చి చెప్పేసింది. ఈ సమయంలో శివసేన అధిష్ఠానం ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందర్నీ ముంబై లోని ఒక హోటల్‌కు తరలించింది. ఆ హోటల్‌ లోనే పార్టీ ఎమ్మెల్యేలు అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

చిరకాల మిత్రపక్షమైన బీజేపీని కాదని, భావజాలం సిద్ధాంత వైరుద్ధ్యమున్న ఎన్సీపీ - కాంగ్రెస్‌ తో ఎలా కలిసి అధికారం పంచుకుంటామని నిలదీసినట్లు సమాచారం.

 

అంతే కాకుండా కొన్ని రోజులు హోటల్‌లో ఉంచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను తమ తమ సొంత ఇళ్లకు ఎందుకు తరలించారని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కూడా ఉద్ధవ్‌ ఠాక్రే పై సగం మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఈ విషయంపై అదే హోటల్‌ లో శాసనసభ్యులు ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దుర్భాషలు ఆడుకోవడమే కాకుండా, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు శివసేన అంతర్గత వర్గాల కథనం.

 

ఈ సంచలన ఘటనతో కలవరపడ్డ శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే వెంటనే ఆ హోటల్‌కు చేరుకొని శాసనసభ్యు లందర్ని సముదాయించినట్లు తెలుస్తోంది. అయితే అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు అధిష్ఠానం పై ప్రత్యక్షంగానేనే దులిపేసినట్లు కూడా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

ఇన్నేళ్లుగా సైద్ధాంతికంగా, భావజాలపరంగా తీవ్ర విభేదాలు న్న పార్టీలతో మనం కలిసి నడవటం అసంభవం అని అన్నారట. వారి సందేహాలకు అధిష్ఠానం నుంచి సంతృప్తికర మైన సమాధానం రాలేదని తనపేరు చెప్పటానికి ఇష్టపడని ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు.

 

అయితే మరోవైపు అనూహ్య అంచనాలు, ఊహాతీత ఆలోచన మధ్య ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం అయ్యారు. శివసేన పార్టీతో పొత్తుపై ఇవాళ ఏదో ఒకటి తేల్చేస్తారంటూ బహుముఖ ప్రచారం జరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపైన గానీ, శివసేన పార్టీతో పొత్తు గురించి గానీ తాము చర్చించనే లేదని ఆయన పేర్కొన్నారు మీడియాతో మాట్లాడుతూ శరద్  పవార్.

 

“శివసేన పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సోనియా గాంధీ వ్యతిరేకిస్తున్నారా?” అన్న విలేకరుల ప్రశ్నకు శరద్ పవార్ స్పందిస్తూ        

 

“ఈ సమావేశంలో అసలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చే జరగలేదు. మరే ఇతర పార్టీతో పొత్తు గురించి కూడా ప్రస్తావన కు రాలేదు. కేవలం కాంగ్రెస్, ఎన్సీపీల గురించి చర్చించేందుకు మాత్రమే మేము సమావేశం అయ్యాం’’ అని పవార్ స్పష్టం చేశారు.

 

కాగా తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ శివసేన పేర్కొనడంపై పవార్ స్పందిస్తూ ‘‘ఈ 170 మంది ఎమ్మెల్యేల గురించి నాకు తెలియదు. ఆ విషయం శివసేన వాళ్లనే అడగండి” అని ఆయన పేర్కొన్నారు.

 

కొసమెరుపు ఏమంటే: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఋఫీ)కి చెందిన కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అధికారం పంచు కునే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యం లో, ఈయన కొత్తగా 3:2 ఫార్ములాను తెరపైకి తెచ్చారు బీజేపీ మూడేళ్లు, శివసేనకు రెండేళ్ల సీఎం పదవి ఉంటే ఓకేనా! అని అడిగారు. ఐతే ఆ ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుంటే తాము కూడా ఆలోచిస్తామని సంజయ్ రౌత్ చెప్పినట్లు అథవాలే తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరలోనే బీజేపీతో చర్చిస్తానని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: