ఇండియా పాక్ దేశాల మధ్య ఎలాంటి గడ్డి వేయకుండానే అణుబాంబులా భగ్గుమంటోంది.  ఇలాంటి సమయంలో రెండు దేశాల మధ్య సామరస్యంమైన సంబంధాలు కొనసాగుతాయా అన్నది తెలియాలి.  కాశ్మీర్ విషయంలో పాక్ రచ్చ చేస్తున్నది.  ఈ విషయంలో ఎప్పుడెప్పుడు ఇండియాతో గొడవపెట్టుకుందామా అని ఎదురు చూస్తున్నది.  ఏ చిన్న అవకాశం వచ్చినా అసలు వదలడం లేదు.  ఇప్పుడు ఇదే చేస్తున్నది.  
పొరపాటున ఎవరైనా టూరిస్టులు ఇండియా బోర్డర్ నుంచి పాక్ లోకి అడుగుపెడితే వాళ్ళను ఉన్నపళంగా పట్టుకొని వాళ్లకు ఉగ్రవాది అనే ట్యాగ్ తగిలించి జైలుకు పంపుతున్నది.  అక్కడి మీడియా ద్వారా, ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియా కావాలని పాక్ పై దాడులు చేసేందుకు ఇండియన్ ఉగ్రవాదులను పాక్ లోకి పంపుతుందని చెప్పి దంచికొడుతుంది.  
కులభూషణ్ జాదవ్ విషయంలో ఇలానే చేసింది.  ఆ తరువాత అభినందన్ ను పట్టుకున్నా.. దౌత్యపరమైన ఒత్తిడితో వారిని వదిలేసింది.  ఇక ఇదిలా ఉంటె, తాజాగా రాజస్థాన్ బోర్డర్ లో థార్ ఎడారిలో ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు తెలుగు వ్యక్తి ప్రశాంత్ కాగా, రెండో వ్యక్తి వారిలాల్ గా గుర్తించారు.  ఈ ఇద్దరినీ ఈనెల 14 వ తేదీన అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ సరిహద్దుల్లో చోలిస్తాన్ ఉన్నది.  ఇక్కడ ఇసుక తెన్నులు ఎక్కువగా ఉంటాయి.  గాలి అధికంగా వీచినపుడు రెండు దేశాల మధ్య ఉన్న ఇసుప కంచెలు కన్పించవు.  అలానే వీరు ఇండియా అనుకోని పొరపాటున బోర్డర్ దాటి ఉంటారనే దానిపై ఇండియా ఆలోచిస్తున్నది.  కానీ, పాక్ మాత్రం వారిని ఉగ్రవాదులుగా ట్రీట్ చేస్తున్నది.  పాక్ పైన అణుదాడికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేసేందుకు వారిని అక్కడికి పంపి ఉంటారని అంటోంది పాక్.  ప్రశాంత్ ఎవరు ఏంటి అనే విషయాలను ఇండియా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: