గల్లీ రాజకీయాలు చేసే నాయకులకు తమ గల్లీలో ఉండే సమస్యలను పక్కన పెట్టి ఎక్కడో ఢిల్లీలో జరిగే రాజకీయాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.  ఏ విషయాలను పెద్దగా పట్టించుకోరు.  నాయకులు ఉండే గల్లిలో ఎవరికైనా బాగాలేదంటేనే పెద్దగా పట్టించుకోరు.. ఇక కుక్క, పిల్లి కోతిలకు ఏదైనా జరిగితే పట్టించుకుంటరా చెప్పండి.. ఆ ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేస్తారు.  


కానీ, కొంతమంది అలా కాదు.  ఏదైనా జరిగితే.. దానిపై ఎక్కువ శ్రద్ద తీసుకుంటారు.  శ్రద్ద తీసుకొని దానికోసం ప్రయత్నం చేస్తారు.  ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని చూస్తారు.  దానికి తగ్గట్టుగా అడుగులు ముందుకు వేస్తారు.  అలా వేసే సమాయంలోనే తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి.  చాలా షార్ప్ గా నిర్ణయాలు తీసుకుంటుంటారు.  ఇలాంటి షార్ప్ నిర్ణయాలు తీసుకునే వాళ్లలో కేంద్ర మాజీ మంత్రి, ఎపి మేనకా గాంధీ కూడా ఒకరు.  


ఢిల్లీలోని రైసినా క్లబ్ రోడ్డులో ఓ కోతి గాయాలతో రోడ్డుపక్కన పడి ఉన్నది.  కదలనేని స్థితిలో ఉన్నది.  ఆ కోతిని చూసిన ఓ జర్నలిస్ట్ వెంటనే దాని ఫోటోను తీసి ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఎవరైనా జంతు సంరక్షణాలయానికి చెందిన వ్యక్తులు వచ్చి రక్షించాలని కోరాడు.  ఈ ఫోటోను మేనకా గాంధీకి కూడా ట్యాగ్ చేశారు.  ఆ ఫోటోను చూసిన మేనకా గాంధీ వెంటనే స్పందించింది.  


తన కారును పంపుతున్నట్టు ట్వీట్ చేసింది.  సంజయ్ గాంధీ సంరక్షణాలయంలో చికిత్స చేయాలనీ ఆదేశించింది.  క్షణాల్లోనే కారు అక్కడ ఉంటుందని చెప్పింది మేనకా గాంధీ.  చెప్పినట్టుగానే క్షణాల్లో ఆమె కారు రైసినా రోడ్డులోకి కోతి పడిఉన్న స్పాట్ కు వచ్చింది.  ఆ కోతిని కారులో సంజయ్ గాంధీ సంరక్షణాలయానికి తీసుకెళ్లారు.  అక్కడే చికిత్స అందిస్తున్నారు.  మేనకా గాంధీ దయాహృదయానికి ప్రతి ఒక్కరు శభాష్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: