రాను రాను టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. మొదట్లో అవసరార్ధం కనిపెట్టిన మొబైల్ ఫోన్, నేడు రోజు రోజుకు సరికొత్త ఫీచర్స్ తో దూసుకుపోతుండగా, ఆ ఫోన్స్ లో వాడుతున్న యాప్స్ కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కగా చూసినా టిక్ టాక్ ట్రెండ్ మరింతగా విస్తరిస్తోంది. అది ఎంతలా అంటే, తమని టిక్ టాక్ వీడియోస్ చేయనీయడం లేదని ఆత్మహత్యలు చేసుకునేదాకా అన్నమాట. అంతలా ఈ టిక్ టాక్ వీడియోలు నేటి ప్రజలకు ముఖ్యంగా యువతను ఎంతో ఊపేస్తున్నాయి. ఇక రాను రాను సెల్ ఫోన్ ధరలు అంతకంతకు దిగి వస్తుండడం, అలానే ఆ ఫోన్స్ లో వాడే కెమెరాల క్వాలిటీ కూడా పెరుగుతుండడంతో, యువత ఎక్కువగా మంచి క్వాలిటీ ఉన్న కెమెరాలను కొనుగోలు చేసి తమ మిత్రులతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. 

 

ఇక ప్రస్తుతం టిక్ టాక్ వారికి మన దేశం నుండి భారీ స్థాయిలో ఆదాయం వస్తుందంటే, అది మన యువత చలవే మరి. ఇకపోతే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లమంది ఈ టిక్ టాక్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోగా, అందులో మన ఇండియా 46.8 కోట్ల యూనిక్ ఇన్స్టాల్స్ తో ప్రధమ స్థానంలో నిలిచింది. అదే పర్సెంటేజ్ ప్రకారం చెప్పాలంటే, దాదాపుగా 31 శాతం టిక్ టాక్ డౌన్ లోడ్స్ మన దేశం నుండే జరిగాయన్నమాట. ఇకపోతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం మంది ప్రజలు ఈ టిక్ టాక్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇక ఆ నివేదికల ప్రకారం, 2019లో భారత నెటిజన్లు ఇప్పటివరకూ 27.6 కోట్ల వరకూ టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, 

 

గ్లోబల్‌ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. ఇక చైనా 4.5 కోట్లతో, అమెరికా 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో 2, 3లో స్థానాల్లో నిలిచాయి. ఇక టిక్‌టాక్‌ 61 కోట్ల డౌన్‌లోడ్స్‌తో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ నాన్‌ గేమింగ్‌ యాప్‌ విభాగంలో మూడవ స్ధానంలో నిలిచి గొప్ప రికార్డుని సొతం చేసుకుంది. కాగా వాట్సాప్‌ 70.74 కోట్లతో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ 63.2 కోట్లతో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ యాప్‌లుగా టాప్‌ 2 స్ధానాలను దక్కించుకున్నాయి. కాగా రాబోయే మరికొద్ది రోజుల్లో వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లను దాటేసే అవకాశం తమ యాప్ కు ఉందని, యువతను మరింతగా ఆకట్టుకునేలా తమ యాప్ లో మరిన్ని నూతన ఫీచర్స్ ని తీసుకొస్తున్నట్లు టిక్ టాక్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: