ప్రభుత్వం తీసుకున్న అప్పు చెల్లించినప్పటికీ  కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసారు అప్పు  ఇచ్చిన వ్యక్తులు. లైంగిక వాంఛ తీర్చాలంటూ రాత్రి సమయంలో ఫోన్లు చేసి వేధింపులు మొదలెట్టారు. ఈ విషయం ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.  కుటుంబ సభ్యులు స్పందించడంతో ప్రస్తుతం ప్రాణాలతో  బయటపడింది ఆ ప్రభుత్వ ఉద్యోగిని . గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆ మహిళా ఉద్యోగిని స్పందన కార్యక్రమం లో తన గోడు చెప్పుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని జీజేహెచ్  లో చికిత్స పొందుతోంది. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసే ఓ మహిళ తన కుమారుడు చదువు కోసం డబ్బులు అవసరం ఉండి అప్పు చేసింది. నరసరావుపేట కు చెందిన ఇద్దరు ఫైనాన్షియర్ల వద్ద... మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది ఆ మహిళ. అయితే ఆ మహిళ ఇద్దరు ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నందుకుగాను ప్రామిసరీ నోటు పై, కాళీ  చెక్కిల పై సంతకాలు పెట్టి ఫైనాన్షియర్ ల కు ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించే  నిమిత్తం ఆ మహిళ ప్రతినెల 15వేల రూపాయలని  ఫెనాన్సియర్స్లకు   చెల్లిస్తోంది. అయినప్పటికీ ఆ  ఇద్దరు వ్యక్తులు  ఆ మహిళ ఇంటికీ  వెళ్లి బలవంతంగా  ఎటిఎం కార్డు ని తీసుకెళ్లారు. అప్పు మొత్తం తీరగానే ఎటిఎం  కార్డు ఇస్తామని చెప్పారు. ఏటీఎం కార్డు అప్పు తీరాక ఇస్తారులే  అని అనుకుంది ఆ మహిళా .

 

 

 

 ఆ తర్వాత ప్రతి నెల 30 వేలు డ్రా చేయడం మొదలు పెట్టారు ఆ ఇద్దరు ఫైనాన్షియర్లు . ప్రతి నెల 30 వేల రూపాయల చొప్పున రెండున్నర సంవత్సరాల పాటు డబ్బులు డ్రా చేసారు . దీంతో మొత్తంగా  8 లక్షలు డ్రా చేసారు . మీకు ఇవ్వాల్సింది రెండు లక్షల కదా ఎనిమిది లక్షలు ఎందుకు డ్రా  చేశారు అని ఆ మహిళ ప్రశ్నిస్తే ఆమె పై అక్రమ కేసులు బనాయించి వేధించడం మొదలుపెట్టారు. తమ దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లిస్తే సరిపోదని తమ లైంగిక కోరిక కూడా తీర్చాలంటూ ఫోన్ చేసి ఆ మహిళలను వేధించడం మొదలుపెట్టారు. దీంతో వారి నుంచి రోజురోజుకు వేధింపులు ఎక్కువవడంతో వేధింపులు భరించలేని మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కాga తాజాగా స్పందన కార్యక్రమం లో అసలు విషయం బయట పెట్టిన ఆ మహిళ తనను కాపాడాలని వారి వద్ద ఉన్న చెక్కులను ప్రామిసరీ నోట్లను  తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: