ఏ ప్రభుత్వం అయినా తన హయాంలో ఉద్యోగులను బాగా చూసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఉద్యోగులకు చిరాకు వస్తే తరువాత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయరు కాబట్టి. అందుకే వారి డిమాండ్లకు వెంటనే స్పందిస్తారు. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు సమావేశాలు, సమీక్షలు, నివేదికలు, ఫాల్అప్‌లు అంటూ పొద్దున్న 6 నుంచి రాత్రి 12 వరకు వదిలిపెట్టరని చెబుతుంటారు. ఎందరో అధికారులు, ఉద్యోగులు బాహాటంగా చెప్పిన మాట ఇది. అయితే, ఇప్పుడు జగన్ సీఎం అయిన తరువాత కూడా పరిస్థితి అలాగే ఉందంటున్నారు అధికారులు. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు, టెలి కాన్ఫరెన్సులు అంటూ నిమిషం ఖాళీ ఉంచడం లేదని చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడేవారు.

 

దీనితో ఉద్యోగులు బాబు గారితో విసుగు పోయారు. దాని ఫలితమే ఎన్నికల్లో ఉద్యోగులు ఎవరు ఓటు వేయలేదు. వీడియో కాన్ఫరెన్స్‌లో వీలు కాకపోతే టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సంప్రదించేవారు. ముఖ్యమంత్రి సమావేశం ముగిసిన వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్‌లో అదే అంశాలపై మరోమారు దాడి చేసే వారని ఉద్యోగులు అనేవారు. అలా నిత్యం రివ్యూలు, మీటింగులు పెట్టడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందాన ఉండేవన్నది ఉద్యోగులు కంప్లయింట్. ఉద్యోగ సంఘాల నాయకులు అప్పట్లో ప్రతిపక్షంలో జగన్‌‌తో పలుమార్లు ఈ విషయం మొరపెట్టుకున్నారు కూడా. దాంతో ప్రభుత్వ ఉద్యోగులను స్వేచ్ఛగా పనిచేసుకోనిస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని  జగన్ అనేవారు.

అయితే అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదని ఉద్యోగులు ఆరోపించడం ఇప్పుడు గమనార్హం. ఇప్పుడు జగన్ సీఎం అయిన తరువాత పరిస్థితి మారుతుందని ఉద్యోగులు ఆశించినా అలాంటిదేమీ లేదంటున్నారు. జగన్ కూడా వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, సమీక్షలు అంటూ ఖాళీ ఉంచడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగియగానే ఉన్నతాధికారులు కలెక్టర్, ఆర్డీఓ, తహసిల్దార్ స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అది ముగిసిన గంటా, రెండు గంటల సమయంలోనే మళ్లీ జిల్లా కలెక్టర్ గ్రామస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లలో అభివృద్ధి పనులపై సమీక్ష చేయడంతో పాటు నివేదికలను సిద్ధం చేయమని ఆదేశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: