చంద్రబాబు నాయుడు 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది.  కాగా, 2005 వ సంవత్సరంలో చంద్రబాబుపై లక్ష్మి పార్వతి ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేసింది.  చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నది.  అయితే, చంద్రబాబు 2005 లో హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు.  అప్పటి నుంచి స్టే కొనసాగుతూనే ఉన్నది.  అయితే, ఇటీవలే సుప్రీం కోర్టు సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి స్టే ఆరు నెలల కాలానికి మించి ఉండకూడదు అని చెప్పడంతో బాబు ఆస్తులకు సంబంధించిన కేసులో మరలా తెరపైకి వచ్చింది.  

 


చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆ కేసును తిరిగి విచారించాలని చెప్పి లక్ష్మి పార్వతి ఏసీబీ కోర్టులో కేసు ఫైల్ చేసింది.  అయితే, హైకోర్టులో స్టే ఉన్నదని బాబు తరపు లాయర్లు కోర్టుకు తెలపగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పొందుపరుస్తూ.. కేసు విచారణను ముందుకు తీసుకెళ్తున్నట్టు కోర్టు తెలిపింది.  ఈనెల 25 వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది.  


బాబుగారు ఎన్నో ఏళ్లుగా స్టే తెచ్చుకొని కాలం గడుపుతున్న కేసులో ఇప్పుడు పురోగతి కనిపించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో భయం పట్టుకున్నది.  ఏం జరగబోతుందో అని భయపడుతున్నారు.  ఒకవేళ తీర్పు బాబుకు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి.. బాబును జైలుకు పంపుతారా.. లేదంటే ఆస్తులను జప్తు చేస్తారా.. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  లక్ష్మి పార్వతి ఆ పార్టీలోనే ఉన్నది.  ప్రస్తుతం తెలుగు అకాడమికి ఆమె అధ్యక్షురాలు.  


పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి బాబుగారుని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  బాబుగారు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.  ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.  ఈ కేసు నుంచి బయటపడటానికి బాబు ఏ విధంగా ముందుకు వెళ్తారు.  ఎందుకంటే, ఏ కేసులో ఏదైనా తేడా వస్తే.. హెరిటేజ్ తో పాటు ఇంకా అనేక కంపెనీలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: