ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గత ఐదు నెలల నుంచి ఇసుక కొరతతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత ఏర్పడడంతో రాష్ట్రంలో  అభివృద్ధికి చేపట్టిన నిర్మాణాలన్ని  ఎక్కడికక్కడ ఆగిపోయి  రాష్ట్ర అభివృద్ధికీ  పులిస్టాప్ పడిపోయింది. ఇక రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా ప్రజలు ఎవరు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. భవన నిర్మాణ రంగ కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలల నుంచి కనీస ఉపాధి కలవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతేకాకుండా కుటుంబ పోషణ భారమై మనస్థాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు భవన నిర్మాణ కార్మికులకు ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతకు  కారణం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి.  రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  సమస్యను  తీర్చాలంటూ  నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి ప్రతిపక్షాలు . 

 

 

 

 రాష్ట్రంలో ఇసుక కొరత రోజురోజుకు ఎక్కువవుతోంది. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... వరదల కారణంగా ఇసుకను తీయలేకపోతున్నామని. ఇంకొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఇసుకను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అంతేకాకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని...  ఇసుకను అక్రమంగా ఎక్కువ రేటుకు  విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఇసుక సమస్యకు  సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఓ టోల్ ఫ్రీ  నెంబర్ ను  కూడా ప్రకటించింది జగన్ సర్కార్. ఇదిలావుండగా తాజాగా జగన్ సర్కార్ ఇసుక పై పేపర్లో ఇచ్చిన ప్రకటన  దుమారం రేపుతోంది.రాష్ట్రంలో ఇసుక  స్టాక్ పాయింట్ లలో ఎక్కడెక్కడ  ఎంతమేర ఇసుక లభిస్తుందో తెలియ చేస్తూ  పేపర్లో ప్రకటన ఇచ్చింది  జగన్ సర్కార్. 

 

 

 

 అయితే ఈ పేపర్ లో ప్రకటనను తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ లలో కూడా  ఇవ్వడం ప్రస్తుతం టిడిపి తప్పు పడుతుంది. జగన్ సర్కార్ తెలంగాణలో కూడా ఇసుక గురించి పేపర్ ప్రకటన ఇవ్వడంపై  స్పందించిన టిడిపి మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్... జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవన నిర్మాణ రంగ కార్మిక ఆకలికేకల, ఆత్మహత్యలను కూడా జగన్ సర్కార్ ఆధాయంగా  మార్చుకుంటుంది అంటూ లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నప్పుడు పక్క  రాష్ట్రాలకు ఇసుకను విక్రయించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు... తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్లలో  ఇసుక స్టాక్ రేట్స్ గురించి ఎందుకు ప్రకటన ఇచ్చారంటూ లోకేష్ ప్రశ్నించారు. మీ పేపర్ లో దొరుకుతున్న ఇసుక రాష్ట్రంలో ప్రజలకు బయట ఎందుకు దొరకడం లేదు అంటూ నిలదీశారు నారా లోకేష్. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారని... ఇసుక సమస్యలపై జగన్ సర్కారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ నిజంగా పని చేస్తే వైసీపీ ఇసుక బకాసురుల  కోసం.. పక్క  రాష్ట్రాల జైల్లు  కూడా సరిపోవంటూ  లోకేష్ విమర్శలు గుప్పించారు

మరింత సమాచారం తెలుసుకోండి: