మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధి జయంతి ఈ రోజు. ఆమె సువిశాల భారత దేశానికి అప్పటికీ, ఇప్పటికీ ఏకైక మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి  ఇందిరాగాంధి  జీవితం పూల పనుపు కాదు. కేవలం 17 ఏళ్ళ వయసులో  తల్లి కమలా నెహ్రూని కోల్పోయింది. ఆ తరువాత తండ్రి జవహర్ లాల్ నెహ్రూ  స్వాతంత్ర పొరాటంలో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో ఇందిర జీవితం మొదటి నుంచి ఒంటరిగానే గడించింది.

ఉన్నత చదువులు చదివినా ఇంట్లో ఉన్న రాజకీయ వాతావరణం ఆమెను దేశ భక్తి వైపుగా  ప్రేరేపించింది. దాంతో ఇందిరా గాంధీ  దేశం కోసం తన పోరాటాన్ని యుక్త వయసులోనే మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలంటే బాల్యంలోనే ఆమె పోరాట బాట ఎంచుకున్నారు. తన తోటి చిన్నారులతో కలసి గాంధీ పక్కన కూర్చుని అనేక ఉద్యమాలు చేశారు

 

ఇక ఇందిరాగాంధి విషయానికి వస్తే ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఫిరోజ్ గాంధీతో విభేదాలు  రావడంతో తండ్రి నెహ్రూ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో నెహ్రూ  దేశానికి తొలి ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. నెహ్రూ పాలనాబాధ్యతలతో తలమునకలైఉన్నారు. ఈ క్రమంలో ఇందిర తండ్రి వద్దనే ఉంటూ ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసింది.

 

ఎటువంటి జీతాన్ని ఆశించకుండా ఇందిరా గాంధీ తండ్రితో దాదాపు దశాబ్దాలు పాటు నడిచింది. నవ భారత నిర్మాణానికి సంబంధించి నెహ్రు ఆలోచనలను పంచుకోవడమే కాదు, తనకున్న మేధస్సులో విలువైన సలహాలు కూడా ఇచ్చింది. మొత్తం మీద ఇందిరాగాంధి పైసా కూడా జీతం తీసుకోకుండా తొలి ప్రధానికి ఫుల్ టైం సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించడం విశేషం.

 

ఆ తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. తండ్రి ప్రధానిగా ఉండగా ఆయనతో కలసి తిరిగి దేశంతో కాంగ్రెస్  పార్టీని పటిష్టం చేశారు. ఆమె తొలుత రాజ్యసభ సభ్యురాలిగా తన పార్లమెంటరీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: