జగన్ ముఖ్యమంత్రి కావాలన్నది ప్రజల అభిమతం. అయితే బంపర్ మెజారిటీతో జగన్ సీఎం కావడం ఏపీలోని  మెజారిటీ రాజకీయ పార్టీలకు అసలు ఇష్టం లేదు. కలలో కూడా జగన్ ముఖ్యమంత్రి అన్న మాటను కలిపి  వాడడానికి ఇష్టపడని రాజకీయ నాయకులు మన ప్రజాస్వామ్యంలో ఉన్నారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు అంటారు, మన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి అని. ఆయన జైలుకు ఎపుడు వెళ్తారో ఎవరికీ తెలియదు అంటారు.

 

ఇక మరో విషయం తీసుకుంటే జగన్ జైలు పొతాడూ అంటూ టీడీపీ గత పదేళ్ళుగా చిలక జోస్యాలు చెబుతూనే  ఉంది. సీబీఐ అరెస్ట్ చేసిన తరువాత బెయిల్ మీద జగన్ బయటకు వచ్చారు. అయితే జగన్ని మళ్ళీ జైలుకు పంపాలని ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా కుటిల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

 

ఇక జగన్ విషయంలో మరో మాట కూడా ప్రతిపక్షాలు ఎన్నికల వేళ చెబుతూ వచ్చాయి. ఆయన ఎపుడు జైలుకు వెళ్తాడో తెలియదు కాబట్టి ఓటు వేయవద్దు అని కూడా గట్టిగా కోరాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు జగన్ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో జగన్ని ఎలాగైనా జైలుకు పంపాలని ప్రతిపక్షం మరో మారు ప్రయత్నాలు చేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

జగన్ బెయిల్ రద్దు చేస్తే ఆయన జైల్లో ఉంటాడు, అపుడు ఏపీ సర్కార్ అస్థిరమవుతుంది అన్నది విపక్షాల ఆలోచనగా కనిపిస్తోంది. బెయిల్ మీద ఉన్న రాజకీయ నేతల కేసులు తొందరగా పరిష్కరించాలని ఓ వైపు సుప్రీం కోర్టు కోరింది. మరో వైపు చూసుకుంటే ఇపుడు దీన్ని ఆసరాగా చేసుకుని జగన్ని మళ్ళీ జైలుకు పంపాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 

దానికంటే ముందు తన ఆనందాన్ని గలీజ్ రాతల ద్వారా సోషల్ మీడియాలోనూ, అనుకూల మీడియాలోనూ రాసుకుంటూ సంత్రుప్తి పడుతున్నాయని అంటున్నారు. మరి ఇదే విధంగా జరుగుతుందా, ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించేందుకు బీజేపీ రెడీ అవుతుందా, గలీజ్ రాతలు అలాగే ఉండిపోతాయా. లేక కోరుకున్న వారికి పరమానందం కలుగచేస్తాయా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: