ఈ మద్య చాలా మంది సోషల్ మీడియాలో తామెంటో తమ టాలెంట్ ఏంటో చూపిస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి పట్టణాల్లోనే కాదు పల్లెల్లో ఉన్న కళాకారులు సైతం అంతేందుకు ఇంట్లో ఉన్న గృహిణులు, చిన్నా పెద్ద అందరూ టిక్ టాక్ తో ఉర్రూతలూగిస్తున్నారు.  అయితే కొన్ని సార్లు ఈ టిక్ టాక్ తో ప్రమాదాలు కొనితెచ్చుకోవడం..ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది.

 

మరికొంత మంది ఏదైనా ఓ వెరైటీ పని చేస్తూ వీడియోల్లోకి ఎక్కడం..అవి కాస్త వైరల్ గా మారడం గమనిస్తున్నాం.  తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ ఎంబీఏ విద్యార్థిని చేపట్టిన ట్రాఫిక్ అవేర్ నెస్ ఉద్యమం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ అమ్మాయి పేరు షుబీ జైన్.  కాకపోతే ఈ అమ్మడు చేసింది మంచి పని కావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

 షుబీ జైన్ అనే యువతి ఇండోర్ నగరంలోని రోడ్లపై వాహనదారులకు జాగ్రత్తలు  చెప్పే విధానం ఓ సంగీత నృత్యరూపకం తరహాలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తన ప్రచార కార్యక్రమానికి కాస్తంత డ్యాన్స్ కూడా జోడించి షుబీ చేస్తున్న విజ్ఞప్తులకు వాహనదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.

 

గతంలో కొంత మంది యముడి వస్త్రాధరణతో కనిపించి ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే నరకానికి వెళ్తావు అని బెదిరించడం.. వినాయకుడి రూపంలో కనిపించడం ఇలా రక రకాల వేషధారణలతో ఆకట్టుకునేవారు. కానీ తన ప్రచార కార్యక్రమానికి కాస్తంత డ్యాన్స్ కూడా జోడించి షుబీ చేస్తున్న విజ్ఞప్తులు ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి.  ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్లు ధరించాలన్నది ఆమె చేపట్టిన కార్యక్రమం సారాంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: