ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు ఇక మొబైల్ ఫోన్ లో వాట్సాప్ సర్వసాధారణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా అప్లికేషన్ ఎంతవరకు భద్రం అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఈ వాట్సాప్ మెసెంజర్ పై నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 

తాజాగా ఒక తీవ్రమైన లోపాన్ని వాట్సాప్ లో కనుగొన్నారు టెక్ నిపుణులు, ఒక వీడియో ఫైల్ ను మీ వాట్సాప్ లో పంపి ఆ వీడియో ను మీరు క్లిక్ చేసి చూసినా లేదా డౌన్లోడ్ చేసుకున్నా మీ ఫోన్ లో కి ఒక హానికరమైన ఫైల్ చొరబడుతుంది దీని ద్వారా మీ ఫోన్‌ను హ్యాక్ చెయ్యొచ్చు ఫలితంగా మీ వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళుతుంది. 

 

ఇంత ప్రమాదకరమైన లోపం వాట్సాప్ లో ఉందని స్వయంగా ఫేసుబుక్ ఒప్పుకుంది "ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఫైల్‌ను వాట్సాప్ వినియోగదారుకు పంపడం ద్వారా స్టాక్-ఆధారిత బఫర్ ఓవర్‌ఫ్లో అనే టెక్నాలజీ తో మీ ఫోన్ లో కి హానికరమైన ఫైల్ వాట్సాప్‌ ద్వారా పంపబడుతుంది." అని ఫేసుబుక్ చెప్పింది. 

 

ఆండ్రాయిడ్, ఐ ఒఎస్  మరియు విండోస్ ఫోన్ వెర్షన్లలో కూడా ఈ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్పైవేర్ సూట్ భారతదేశంలో అనేక డజన్ల మంది వ్యక్తులతో సహా ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది జర్నలిస్టులను మరియు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించబడిందని వెల్లడించారు. ఈ రకమైన దాడిని వ్యాప్తి చేయడానికి ఉపయోగించే మాధ్యమాల్లో వాట్సాప్ ఒకటి.

 

వెంటనే అప్రమత్తమైన కేంద్రం, ఇండియన్ ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వాట్సాప్ ను తమ ఫోనుల్లో వాడొద్దని ఆదేశించింది. ఒక వేళ ఇప్పటికే ఫేసుబుక్ కానీ వాట్సాప్ కానీ వాడుతుంటే వెంటనే లాగౌట్ అవ్వమని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలు జవాన్ మరియు ఆ పై స్థాయి అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది.

 

ఇక ఈ లోపం పై స్పందించిన వాట్సాప్ తన వివరణను ఇచ్చింది "వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి వాట్సాప్ నిరంతరం పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు లోపాల్ని గుర్తించి వెంటనే సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం" అని వాట్సాప్ ఒక ప్రకటనలో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: