టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీలో కీలక నేతలు అందరూ పార్టీని వీడుతూ ఉండడంతో భారీ షాక్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు... ఇప్పుడు ఏసీబీ మరో షాక్ ఇవ్వనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని లక్ష్మీపార్వతి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపించాలంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే గత 14 ఏళ్ల క్రితం లక్ష్మి పార్వతి  దాఖలు చేసిన పిటిషన్పై చంద్రబాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో...ఇన్ని రోజుల విచారణ జరగలేదు. తాజాగా స్టే  గడువు తాజాగా ముగిసింది. ఈ విషయంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో... విచారణ  ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీఐ   ప్రత్యేక కోర్టు జడ్జ్  సాంబశివరావు నాయుడు చంద్రబాబుకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. 

 

 

 

 అంతేకాకుండా ఫిర్యాదుదారు అయిన  లక్ష్మీపార్వతి సాక్షాన్ని కూడా నమోదు చేయాలంటూ  తదుపరి విచారణను ఈనెల 25 కు వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. క్రిమినల్ కేసులు ఆరు నెలలకు మించి స్టే  ఉండకూడదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై 14 ఏళ్ల తర్వాత మరోసారి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే అప్పట్లో హైకోర్టు నుండి చంద్రబాబుపై స్టే తెచ్చుకున్నప్పటికీ చంద్రబాబుకు హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని  పిటిషన్ దాఖలు చేసింది లక్ష్మి పార్వతి .ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

 

 

 

 

 ఇక ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబుకు స్టే లేనట్లే అని  భావిస్తూ చంద్రబాబు ను విచారించేందుకు సీబీఐ  నిర్ణయించారు. చంద్రబాబు తెచ్చుకున్న స్టే గడువు ముగియటంతో పాటు, స్టే కు  ఎలాంటి పొడిగింపును హైకోర్టు ఇవ్వకపోవటంతో కేసు తదుపరి విచారణ ప్రారంభిస్తున్నట్లు  ఎసిబి అధికారులు స్పష్టం చేశారు.దీంతో  టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే కీలక నేతలు అందరూ పార్టీని వీడుతుండటంతో  పార్టీ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్న  తరుణంలో... ఇప్పుడు ఏసీబీ ప్రత్యేక కోర్టు   చంద్రబాబు ను విచారించేందుకు నిర్ణయించటంతో  కూడా బాబుకు మరో తలనొప్పిగా  మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: