రాష్ట్రంలోకి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో కొత్త విధానం అమల్లోకి తెస్తూ ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది.  విద్యార్ధుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తల్లితండ్రులతో పాటు విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల‌ రుబ్బుడు కార్యక్రమాలకు కొంత వరకూ బ్రేక్ పడుతూండగా, బాలలు మాత్రం కొంత సేద తీరే అవకాశాన్ని పొందుతున్నారు. ఓ విధంగా జగన్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంగా దీనిని చెప్పుకోవాలి.

 


వివరాలోకి వెళతే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల్లో నీటి గంట కార్యక్రమాన్ని కచ్చితంగా అమలుచేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల సదూర ప్రాంతాల నుంచి చదువు కోసం పాఠశాలలకు వచ్చే విధ్యార్ధులు కనీసం మంచి నీళ్ళు కూడా తగకుండా వారికి తరగతి గతుల్లో బంధించే రుబ్బుడు ప్రోగ్రాం లకు కొంత బ్రేక్ పడుతుంది. గంట మోగించిన వెంటనే విద్యార్ధులు బ్రేక్ తీసుకుని మంచినీళ్ళు తాగుతారన్న మాట.

 

ఈ విధంగా ఉందయం పదిన్నర గంటలకు, మధ్యాహ్నం పన్నెండు గంటలకు, తిరిగి సాయంత్రం మూడు గంటలకు నీటి గంట ఠంచనుగా ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మోగించాలని సర్కార్ గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కనీసం దాహం తీర్చుకునే సమయం కూడా ఇవ్వకుండా పాఠాలు బోధించే ప్రైవేట్ స్కూళ్ళ దాహానికి  కొంత బ్రేక్ పడినట్లే.

 

విధ్యార్ధులు హాపీగా నీటి గంట కొట్టిన సమయంలో  మంచి నీళ్ళు తాగి తమ దాహార్తిని తీర్చుకుంటారు. చిన్నారులకు ఓ విధంగా ఇది బిగ్ రిలీఫ్. కేరళలో ఒక పాఠశాలలో ప్రవేశపెట్టిన నీటి గంట కార్యక్రమం విజయవంతం కావడంతో ఏపీలో కూడా దీన్ని అమలు చేయాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

 


మంచి నీరు తగినంత శరీరానికి తీసుకోకపోవడం వల్ల బాల్యం నుంచే విధ్యర్ధులు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు పడుతున్నారు. దీంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కూడా ఇది ఇపుడు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి ఇది మంచి నిర్ణయం అని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: