ఇపుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారో ?

 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు చేయటానికి రాష్ట్రంలో ఇపుడు ఇష్యుయే లేదు వీళ్ళిద్దరికి. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో నిర్దిష్టంగా జగన్ ఫలానా తప్పు చేశారు అని చెప్పటానికి పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. సమస్యలు లేక ప్రతిపక్షాలు నానా అవస్తలు పడుతున్న సమయంలోనే ఇసుక కొరత మొదలైంది.

 

ఇంకేముంది కోతికి కొబ్బరి కాయ దొరికినట్లుగా చంద్రబాబునాయుడు, లోకేష్, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్ అందరూ ఇసుక సమస్య వెనకాల పడ్డారు. వరదలు, వర్షాల కారణంగా ఇసుక రీచులన్నీ ముణిగిపోయాయి. అందుకనే ఇసుకను తీయలేకపోతున్నామని జగన్ అండ్ కో ఎంత చెప్పినా వినకుండా ఎల్లోమీడియా మద్దతుతో నానా యాగీ చేశాయి.

 

ఈనెల మొదటివారం నుండి వరదలు, వర్షాల ప్రభావం తగ్గిపోవటంతో ఇసుక తవ్వకాలు, సరఫరా ఊపందుకుంది. ఇసుక సమస్య పరిష్కారమయ్యే చివరి రోజుల్లో హఠాత్తుగా స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం అంశం తెరపైకి వచ్చింది. వెంటనే చంద్రబాబు అండ్ కో పవన్ ఇసుక సమస్యను వదిలిపెట్టేసి ఇంగ్లీషు మీడియం వెంట పడ్డారు.

 

ఈ సమస్య మీద కూడా ఎన్నో రోజులు ఆందోళనలు సాధ్యం కాదని వీళ్ళకు అర్ధమైపోయింది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఏ సమస్యకు కూడా జనాల మద్దతు లేదన్నది వాస్తవం. ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టటంలో వ్యతిరేకత అంతా చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు ఎల్లోమీడియాలో మాత్రమే కనబడుతోంది. విద్యార్ధులు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతుగానే ఉన్నారు.

 

ఇంగ్లీషుమీడియంలో చదవటానికి విద్యార్ధులకు లేని సమస్య చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియాకు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. విషయం ఏదైనా సరే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్న మొరట ఆలోచన తప్ప మరోటి కనబడటం లేదు. సరే వీళ్ళల్లో ఎంత వ్యతిరేకతున్న జగన్ లెక్క చేయటం లేదు. దాంతో ఈ ఆందోళన కూడా ఎన్నో రోజులు సాగదు. మరి ఈ పరిస్ధితుల్లో జగన్ ను వ్యతిరేకించటానికి వీళ్ళకు ఇష్యునే కనబడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: