నిన్నటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  ఈ సమావేశాల్లో అనేక విషయాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఈరోజు జలియన్ వాలాబాగ్ చట్టసవరణ బిల్లులో మార్పులు చేసేందుకు కేంద్రం పట్టుబడుతున్నది.  జలియన్ వాలాబాగ్ బిల్లులో గతంలో కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే.  జలియన్ వాలాబాగ్ మెమోరియల్ ట్రస్ట్ కు గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు చైర్మన్ గా ఉండే వారు.  కానీ, ఆగష్టు 2 వ తేదీన ఈ బిల్లులో కొన్ని సవరణలు చేశారు.  
దాని ప్రకారం జలియన్ వాలాబాగ్ ట్రస్ట్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇకపై ట్రస్ట్ చైర్మన్ గా ఉండరు.  ఇక ఈ ట్రస్ట్ లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు, పంజాబ్ ముఖ్యమంత్రి, పంజాబ్ గవర్నర్ సభ్యలుగా  ఉంటారు.  జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన తరువాత అక్కడ వారి వీరే మరణానికి గుర్తుగా ఒక మొరియల్ ను నిర్మించారు.  ఈ మొరియల్ బాధ్యతలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.  
అయితే, జలియన్ వాలాబాగ్ అనగానే మనకు పంజాబ్ లో జరిగిన మారణహోమం గుర్తుకు వస్తుంది.  జలియన్ వాలాబాగ్ గురించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలుసుకోవాలి.  జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
ఇది దేశంలో దురదృష్టకరమైన రోజుగా అభివర్ణించాలి.  గుర్రాలతో తొక్కిస్తూ.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.  దేశంలోనే అత్యంత కిరాతకంగా చర్య ఇది.  దీని తరువాతే దేశంలో స్వాతంత్రోద్యమం మరింత ఉధృతమైన సంగతి తెలిసిందే.  ఈ ఉదంతం తరువాత మహాత్మాగాంధీ ఆఫ్రికా నుంచి వచ్చి అహింసా ఉద్యమాన్ని ప్రారంభించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: