ఏ సంస్దలో చూడు కార్మికుల పని సమయాలు ఎక్కువగానే ఉంటాయి. కాని వేతనాలు చాల తక్కువ ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించలేక పోయింది. ఉన్న రూల్స్‌ను సక్రమంగా అమలు చేయక విఫలమవుతుంది. ఇప్పటికి కొన్ని కొన్ని చోట్ల పనిచేసే కార్మికులు అధిక శ్రమ దోపిడికి గురవ్వుతున్నారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

 

 

అదేమంటే కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మికుల పని గంటలను 9 గంటలకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. దీని వల్ల కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇక నుండి 9 గంటలుగా మారనుంది. పలు ఫ్యాక్టరీలు ఇప్పటికే కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి. ఈ విధానం కనుక అమల్లోకి వస్తే ఆ పని గంటలు పది గంటలు కూడా కావచ్చూ. ఇకపోతే వారంలో ఒక రోజు సెలవు దినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను  భారత ప్రభుత్వం డ్రాఫ్ట్ వేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది.

 

 

అయితే.. ఒక కార్మికుడికి కనీస వేతనం ఎంత ఉండాలనే విషయంలో మాత్రం ఏ  నిర్ణయం తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలను సూచించడం మినహా చాలా వరకు పాత నిబంధనలను ముసాయిదా పునరుద్ఘాటించింది. ఇక ఈ నెలాఖరులోగా ఉద్యోగులు, కార్మికులు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ అభిప్రాయాల్ని తెలిపేందుకు వీలుగా ఓ మెయిల్ ఐడిని క్రియేట్ చేసింది.

 

 

కార్మికులు ఎవరైనా ఈ-మెయిళ్లకు తమ అభిప్రాయాలు పంపొచ్చు అని తెలిపింది.   ఆ మెయిల్ అడ్రస్ ఏంటంటే   rajiv.ranja76@gov.in లేదా malick.bikash@gov.in దీనికి మీ అభిప్రాయాలు తెలుపవచ్చూ. ఇకపోతే పని గంటలు పెంచినంత మాత్రాన శాలరీలు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. అందువల్ల కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించే అవకాశాలున్నాయి.

 

 

కాబట్టి వారి అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకొని కేంద్రం ఫైనల్ నిర్ణయం తీసుకునే వీలుంది.  కాగా, తొలిసారిగా 1957 లో లెక్కించిన కనీస వేతనం విధానమే ఇప్పటికీ అమలు చేస్తుండటం గమనార్హం. అప్పటికి ఇప్పటికి సామాన్య మానవులనుండి సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి. అందువల్ల, ఈ లెక్కలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసి పెంచాలని అంతర్గత కమిటీ సూచిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: