గత కొంత కాలంగా దాయాది దేశమైన పాక్ ప్రతి చిన్న విషయానికి భారత్ పై విషం కక్కుతున్న విషయం తెలిసిందే.  అయితే భారత్ ఎంత ఓపిక పట్టుకున్నా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో ఎప్పుడు దాడులు చేస్తూ భారత్ పై దాడులు చేయిస్తూనే ఉంది.  తాజాగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఇద్దరు భారత జాతీయులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రశాంత్ వైందం,  రెండో వ్యక్తిని మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌గా గుర్తించారు. ఈ నెల 14న బహావుల్‌పూర్‌లో వీరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పాక్‌ పోలీసులు చెప్పారు.

 

 పాస్‌పోర్టు, వీసా లేకుండా చోలిస్తాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. వీరిద్దరిపై పాక్‌ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదు చేశారు. విశాఖ గాజువాకలో ప్రశాంత్ మిస్ అయినట్లుగా పాక్‌ ఎఫ్.ఐ.ఆర్‌లో పేర్కొంది. పాక్‌ చెరలో ఉన్న ప్రశాంత్ సరిహద్దులు దాటి ఎందుకు వెళ్లాడు...? అతను పాస్ పోర్టు, వీసా లేకుండా పాక్‌లో ప్రవేశించాడా...? ప్రశాంత్ అరెస్టు భారత్, పాక్ మధ్య మరో దౌత్య పరంగా మరో వివాదంగా మారబోతుందా...? అనే విషయం తెలియాల్సి ఉంది.

 

పాక్‌ చెరలో ఉన్న ప్రశాంత్ సరిహద్దులు దాటి ఎందుకు వెళ్లాడు...? అతను పాస్ పోర్టు, వీసా లేకుండా పాక్‌లో ప్రవేశించాడా...? ప్రశాంత్ అరెస్టు భారత్, పాక్ మధ్య మరో దౌత్య పరంగా మరో వివాదంగా మారబోతుందా...?.   ఇక రాజస్థాన్‌లో థార్‌ ఎడారిలో వీచే ప్రచండ గాలుల వల్ల ఇసుక తిన్నెలు ఒక చోటు నుంచి మరోచోటుకు బదిలీ అవుతుంటాయి.

 

ఫలితంగా భారత్‌-పాక్‌ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి.  దాంతో అక్కడ సందర్శన కోసం వచ్చిన వారు బార్డర్ ని గుర్తు పట్టని పరిస్థితుల్లో  పొరపాటున సరిహద్దును దాటి పాక్‌లోకి అడుగుపెట్టిన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయని వివరించాయి. తాజా కేసులోనూ ఇదే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  గతంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని డేరాగాజీ ఖాన్‌ జిల్లా రాఖీగజ్‌ ప్రాంతంలో ఓ భారతీయుడిని అరెస్టు చేశామని, అతడి పేరు రాజు లక్ష్మణ్‌ అని పోలీసులు వెల్లడించారు.

 

గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు రాజు లక్ష్మణ్‌ అంగీకరించాడని వెల్లడించారు. బెలూచిస్థాన్‌ ప్రావిన్స్‌నుంచి అతడు వచ్చినట్లు చెప్పారు. గతంలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కూడా గూఢచర్యం ఆరోపణలతో ఇదే విధంగా బెలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

అప్పట్లో  పాకిస్తాన్‌ జైళ్లల్లో ఖైదీలుగా 537 మంది భారతీయులు ఉన్నట్లు దాయాది దేశం ఒక జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే.  2008 మే 21లో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: