హైదరాబాద్ వాసి ప్రశాంత్ పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రశాంత్ పట్టుబడినట్లు పాక్ మీడియా ఓ వీడియోని చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది . లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ తో  మతిస్థిమితం కోల్పోయి ప్రశాంత్ అనే హైదరాబాద్ వాసి పాకిస్తాన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా  విషయం తెలుసుకున్న ప్రశాంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కొడుకు అలాంటి వాడు కాదని... మా కొడుకు మా ఇంటికి పంపించాలి అంటూ మీడియా అని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా తమ కొడుకు రెండు సంవత్సరాల నుంచి కనిపించడం లేదని...తమ  కొడుకు కనిపించడం లేదంటూ 2017 ఏప్రిల్ నెలలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు ప్రశాంత్ తల్లిదండ్రులు చెబుతున్నారు. 

 

 

 

 అయితే పాక్ పోలీసులు టోలిస్థాన్ లో ప్రశాంత్ ను  అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ లోనే  ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్న సమయంలో తన కొలీగ్ తో ప్రేమలో పడ్డారని ప్రశాంత్ తండ్రి బాబురావు  తెలిపారు. ఆ అమ్మాయి వల్ల ఇలా అయి ఉంటాడు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమ కొడుకును తన ఇంటికి పంపించాలంటే విజ్ఞప్తి చేశారు. ప్రశాంత్ విషయంలో ఇలాంటి ఆరోపణలు చేయకుండా మానవతా దృక్పథంతో భారత్ కు  పంపించాలంటూ ప్రశాంత్ బంధువులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పాక్ మీడియా రికార్డ్ చేసి  ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.. ఈ వీడియోలో మాట్లాడిన ప్రశాంత్ అమ్మ నాన్న నేను ఇక్కడ బాగున్నాను... నన్ను కోర్టుకు  తీసుకొచ్చారు. తర్వాత జైలు కి తీసుకెళ్తారు... ఇండియా నుంచి నాకు బెయిల్ ఇస్తే ఇక్కడినుంచి  ఇండియా రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది అంటూ  వీడియోలో తెలిపాడు ప్రశాంత్. 

 

 

 

 తమ కొడుకును విడుదల అయ్యేలా చూడాలని ఇండియన్ ఎంబసీ ని కోరుతున్నారు ప్రశాంత్ తల్లిదండ్రులు. అంతే కాకుండా ఈ నెల 14న మధ్యప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తి కూడా రాజస్థాన్ గుండా  పాక్ బార్డర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని కూడా పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. అయితే దీనిపై భారతీయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కమాండర్ అభినందన్ విషయంలో చేసినట్లే... పాక్ మీడియా వీరిద్దరి  విషయంలో కూడా కాస్త అతి  చేస్తుంది అంటూ పాక్ మీడియా పై మండిపడుతున్నారు. మతి స్థిమితం లేకుండా పాక్ బార్డర్ లోకి ఎంటర్ అయినప్పటికీ... పోలీసులు అతిగా రియాక్ట్ అయి వేరే రకంగా ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: