దాదాపు నెల రోజులు గా ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని కి మధ్య సంధి చేద్దామని విపరీతమైన ప్రయత్నాలు చేసిన తెలంగాణ హైకోర్టు చివరికి చేతులెత్తేసింది. సోమవారం మరొక సారి ఇరు వర్గాల వాదనలు వినడానికి సిద్ధమైన హైకోర్టు తో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ మరొకసారి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటం చట్ట వ్యతిరేకం అని చెప్పడంతో హైకోర్టు కూడా తాము ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నట్లు తెలిపారు. కావున వారు ఆర్టీసీ వారిని నిరుత్సాహపరిచే ఒక నిర్ణయం తీసుకున్నారు. 

 

అడ్వకేట్ జనరల్ మాటలు విన్న హైకోర్టు తమకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానకైనా తమ పరిధులు తమకు ఉంటాయని వాటి నుంచి తాము తప్పుకొని వెళ్ళలేము కాబట్టి ఈ కేసుని లేబర్ కోర్టు కు ఫార్వర్డ్ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అలాగే లేబర్ కమిషనర్ కు ఈ సమస్యను రెండు వారాల లోగా తీర్చేయాలని కూడా అపీల్ చేసింది హైకోర్టు.

 

ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరియు కేసీఆర్ ఒక విజయం గానే భావించవచ్చు. దీనితో మరొక రెండు రోజుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు మరియు 5 వేల ఒక్క వంద మార్గాల్లో ప్రైవేటు బస్సులు నడిపేందుకు కోర్టు నుంచి అనుమతి రావచ్చు. మరొక వైపు చూస్తే ఆర్టీసీ కార్మికుల విజయం కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ఆరోగ్య పరిస్థితుల రీత్యా డాక్టర్ల పట్టు మీద నిరాహార దీక్షను విరమించిన సంగతి కూడా తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీకి ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అని తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: