అనుమతి లేకుండా పాకిస్తాన్ లోకి ప్రవేశించిన హైదరాబాద్ యువకుడు ప్రశాంత్ ను మధ్యప్రదేశ్ కు చెందిన దారిలాల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వారిని అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు. పాస్ పోర్టు... వీసా లేకుండా కొలిస్థాన్ ఎడారిలోకి ప్రవేశం చేసేందుకు ప్రయత్నించిన వీరిద్దరిని బహవర్ పూర్ వద్ద నవంబర్ 14న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు అక్రమంగా పాకిస్తాన్ లోకి ఎందుకు ప్రవేశించారన్న దానిపై అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

అయితే తాను క్షేమంగా ఉన్నానని పోలిసుల అనుమతితో ఒక వీడియోని రిలీజ్ చేసాడు ప్రశాంత్. "మమ్మీ.. డాడీ బాగున్నారా? ఇక్కడ అంత బాగానే ఉంది. ఇప్పుడు నన్ను కోర్టుకి తీసుకొచ్చారు. మాక్సిమం వన్ మంత్ లో రిలీజ్ అయ్యిపోవచ్చు. కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్తారు. ఇండియన్ ఎంబసీ వాళ్లు నా గురించి వివరాలు తెలియజేస్తారు. ఆ తర్వాత బెయిల్ ఇప్పించడానికి ప్రాసెస్ ఉంటది. తర్వాత నన్ను ఇండియన్ ఎంబసీ వారికి అప్పగిస్తారు. అప్పుడు నేను ఇంటికి వచ్చి మీతో కాంటాక్ట్ చేయడానికి వీలు అవుతది" అంటూ అతను వీడియో చెప్పాడు. 

 

విశాఖపట్నం నివాసులైన ప్రశాంత్ ఫ్యామిలీ హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నారు. ప్రశాంత్ తండ్రి బాబు రావు మాట్లాడుతూ..." లవ్ ఎఫైర్ ఉందని తెలిసింది. తర్వాత ఆమె కోసం స్విట్జర్లాండ్ వెళ్లాడని న్యూస్ ద్వారా మాకు తెలిసింది. 2017లో ఏప్రిల్ 29వ రోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో మా కొడుకు తప్పిపోయాడని కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంటాక్ట్ లేదు ఫోన్ లేదు. ఆమె పేరు స్వప్నిక పాండే. ఆమెది బెంగళూరు. మా అబ్బాయి ఆ స్వప్నిక పాండే అమ్మాయి కొలీగ్స్. బెంగళూరులో మా అబ్బాయి ఒకటిన్నర సంవత్సరాలు సాఫ్ట్ వేర్ జాబ్ చేశాడు. తర్వాత ఆర్నెల్లు చైనాకు ఒక్కసారి ఆఫ్రికాకు ఒకసారి వెళ్ళాడు. ఆ అమ్మాయి ప్రేమతో కొంచెం డిప్రెషన్లోకి వెళ్లి మానసిక స్థితి సరిగా లేక.. ఏం చేస్తున్నాడో అతనికి తెలియక పాకిస్తాన్ వెళ్ళి ఉండవచ్చు." అని వాళ్ళ ఫాదర్ తెలిపారు. 

 

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం... ప్రశాంత్ ప్రేమించిన ప్రియురాలు కోసం గూగుల్ మ్యాప్ లో వెతుకుంటూ భారత్ బోర్డర్ ని దాటి.. పాకిస్తాన్ భూ భాగంలో 2 ఏళ్ల క్రితమే అడుగుపెట్టాడని పాకిస్తాన్ మీడియా అంటుంది. ప్రేమ విఫలమవడంతో మతిస్థిమితం కోల్పోయి అటు ఇటు తిరుగుతూ చివరికి ఎడారి మార్గంలో పోలీసులుకు చిక్కాడని అక్కడి మీడియా చెప్తుంది. 

 

అయితే పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరపడానికే వీరిద్దరూ వచ్చారని అక్కడ అధికారులు అనుమానిస్తున్నారని పాక్ లోని జియో న్యూస్ సంస్థ వెల్లడించడం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: