పాక్ చెరలో తెలుగు యువకుడు చిక్కుకోవడం నిన్నటి నుండి తెలుగు రాష్ట్రాల్లో సంచలనమవుతున్న సంగతి తెలిసిందే. కొలిస్థాన్ ఎడారిలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో భారత్‌కు చెందిన ఇద్దరు యువకులను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన యువకుడు చెందినవాడు ఉన్నాడు. వీరిద్దరూ పాస్‌పోర్టు, వీసా లేకుండా తమ భూభాగంలోకి ప్రవేశించారనేది పాక్ అభియోగం. వారిని భావల్‌పూర్‌లో అరెస్టు చేశారు. 

 

అయితే ఈ విషయం తెలుసుకున్న కొందరు హైదరాబాద్ కు చెందిన యువకుడు పాకిస్థాన్ వెళ్లడం ఏంటి ? అసలు రాజస్థాన్ ఎందుకు వెళ్ళాడు.. అతను ఎవరికి సంబంధించిన వ్యక్తి ? ఎం చదివాడు ? అని పరిశీలించిన సమయంలో అతని గురించి సంచలన విషయాలు బయట పడ్డాయి. ఆ విషయాలు ఏంటి అనేది ఇక్కడ చదవండి.  

 

పాక్ చెరలో చిక్కుకున్న ప్రశాంత్ గురించి తండ్రి బాబూరావుని గురించి ప్రశ్నించగా సంచలన విషయాలు బయట పెట్టాడు. ప్రశాంత్‌ అమాయకుడు అని, 2017 ఏప్రిల్ 11న ప్రశాంత్ ఆఫీసుకు వెళ్లి తిరిగి రాలేదని అన్నారు ప్రశాంత్ తండ్రి బాబూరావు. అయితే ఇంటికి రాలేదు అని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని అయినప్పటికీ పోలీసులకు ఫోన్ చేసినా వివరాలు తెలియలేదని ఆ తర్వాత 2018లో పోలీసుల్ని సంప్రదిస్తే ప్రశాంత్ పాకిస్థాన్‌‌లో ఉన్నాడని అతడ్ని తిరిగి పంపించేస్తారని చెప్పారు అని అందుకే ఆ తర్వాత ప్రశాంత్ గురించి పట్టించుకోవడం మానేసినట్టు తండ్రి బాబురావు చెప్పారు. 


 
తన కుమారుడు పాకిస్థాన్ ఎందుకు వెళ్లాడో తెలియదని టీవీల ద్వారానే తమకు తెలిసిందని తండ్రి బాబూరావు చెప్పారు. కాగా ప్రశాంత్‌ ప్రేమ వ్యవహారంతో డిప్రెషన్‌కు గురై పాకిస్థాన్ వెళ్లాడని చెబుతున్నారు. అయితే ప్రశాంత్ తో స్వప్నికా పాండే అనే యువతీ బెంగళూరులో పనిచేసిందని.. అక్కడే ఇద్దరు ప్రేమించుకున్నారని.. ఆ తర్వాత విడిపోయి ప్రశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళడాని.. తర్వాత కనిపించకుండా పోయాడని చెప్పారు. 

 

అయితే అతను కొలిస్థాన్ ఎడారిలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణతో ప్రశాంత్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియో చుసిన కొందరికి జాలి అనిపించగా మరికొందరు.. ప్రేమలో ఓడిపోతే పాకిస్థాన్ పోతారా ? అని నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: