సర్బజిత్ సింగ్ ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. మద్యం మత్తులో పాకిస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించిన పాపానికి సంబంధం లేని కేసుల్లో ఇరికించి మరణ శిక్ష విధించారు. పది సంవత్సరాలకు పైగా చిత్రహింసలు పెట్టారు పాక్ జైలు అధికారులు. చివరికి పాక్ జైల్లోనే హత్య కు గురయ్యాడు సరబ్జీత్. ఇక ప్రస్తుతం హైదెరాబాదీ ప్రశాంత్ కూడ పాక్ లో కి ప్రవేశించి అరెస్ట్ కాబడ్డాడు. ప్రశాంత్ ఎప్పుడు తిరిగివస్తాడో అని దేశం యావత్తు ఆసక్తితో ఎదురు చూస్తోంది.

 

పాక్ లోకి అక్రమంగా ప్రవేశిస్తే ప్రత్యక్ష నరకమే తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే పాక్ ప్రభుత్వం చాలా కఠినం గా వ్యవహరిస్తుంది. అక్రమంగా చొరబడిన వారిని ఒక చీకటి గదిలో వేసి రోజుల తరబడి అన్నపానీయాలు ఇవ్వకుండా చిత్రహింస చేస్తారు. మలవిసర్జనకు బయటకు వెళ్లనివ్వరు కేటాయించిన గదిలోనే మల విసర్జన చేయాల్సి ఉంటుంది. విసర్జించిన మలం లో ఖైదీ మొహాన్ని ఉంచి చిత్రహింస కు గురిచేస్తారు. గది ని శుభ్రం చెయ్యరు. స్నానం చేయనివ్వరు, మానసికంగా, శారీరకంగా హింస కి గురి చేసి చివరకి జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తారు. బ్రతికి ఉండగానే ప్రత్యక్ష నరకం చూపిస్తారు.

 

వింటేనే వణుకు పుట్టే ఈ పాక్ జైళ్లల్లో ఖైదీల పరిస్థితి వర్ణనాతీతం. ఇక ప్రస్తుతం పాక్ లో అరెస్ట్ అయిన ప్రశాంత్ నేపథ్యంలోనే రెండేళ్ల నుంచి కనిపించకుండాపోయినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆ తరువాత బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్న సమయంలో సహోద్యోగితో ప్రశాంత్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

 

ప్రేమ కాస్తా విఫలం కావడంతో మానసిక ఒత్తిడికి గురై, ఈ క్రమంలోనే రాజస్థాన్‌ వెళ్లి పొరపాటున పాక్‌లోకి అడుగుపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా, గత రెండేళ్లుగా ప్రశాంత్ పూర్తి డిప్రెషన్‌లో ఉన్నాడని, మతిస్థిమితం కోల్పోయాడని కూడా అతని తండ్రి వాపోయారు. మరోవైపు పాక్‌ మీడియా మాత్రం అతను అక్రమంగా ప్రవేశించాడని, పాక్‌ నుంచి యూరప్‌ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడినట్టు పలు కథనాలను ప్రచురించింది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: