ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేలమంది సిబ్బందికి ఒకేసారి వాలంటరీ రిటైర్మెంట్ సర్వీసు (విఆర్ఎస్) ఇచ్చేయాలని కేసియార్ ఆలోచిస్తున్నారా ? మామూలుగా అయితే విఆర్ఎస్ అన్నది ఉద్యోగి ఇష్టపడో లేకపోతే తప్పనిసరి పరిస్ధితుల్లోనే రిటైర్మెంటుకు తనకు తానుగా ఎంచుకునే మార్గం. కానీ ఇదే విఆర్ఎస్ పద్దతిని కేసియార్ ఉద్యోగులందరికీ బలవంతంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 

గడచిన 46 రోజులుగా ఆర్టీసీలో నిరవధిక సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మె మొదలైంది. అయితే విలీనం డిమాండ్ కు కేసియార్ పూర్తి విరుద్ధంగా ఉండంటతో సమ్మె ఎన్నిరోజులు జరిగినా ? ఎంతమంది చనిపోయినా పరిష్కారం మాత్రం కనబడటం లేదు. చివరకు హై కోర్టు కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది.

 

సమ్మె విషయం మొత్తానికి హై కోర్టు నుండి లేబర్ కోర్టుకు చేరుకుంది. లేబర్ కోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. ఇక్కడ గనుక సమ్మె చట్టవిరుద్ధమని తేలితే అందరి ఉద్యోగాలు పోవటం ఖాయమే. అయితే ఉద్యోగాలు పోకూడదని అనుకుంటే కేసియార్ చెప్పినట్లు ప్రతీ ఉద్యోగి ఇండివిడ్యువల్ గా ప్రభుత్వానికి అఫిడవిట్ ఇవ్వాలట.

 

ఇంతకీ అదేమిటంటే సమ్మె వదిలిపెట్టేసి భేషరతుగా విధుల్లో చేరుతున్నట్లుగా లేఖ ఇవ్వాల్సుంటుంది. భవిష్యత్తులో ఏ విధంగా కూడా సమ్మె చేయబోనంటూ ప్రమాణపత్రం ఇవ్వాలి. రెండు లేఖలు ఇవ్వటానికి ప్రతీ ఉద్యోగి ఒప్పుకుని ఎవరికివారుగా ప్రమాణపత్రాలు జతచేసిన లేఖలు ఇస్తేనే ఉద్యోగం. లేకపోతే బలవంతంగా అందరికీ విఆర్ఎస్ పద్దతిని వర్తింపచేయాలని కేసియార్ ఇప్పటికే డిసైడ్ అయ్యారట.

 

ఒకసారి కేసియార్ నిర్ణయిస్తే కుదరదని చెప్పే మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఉంటారా ? ఎవరైనా అలా చెప్పే వారుంటే సమ్మె విషయం ఇంతదాకా వచ్చేదే కాదు. సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ కోర్టు ప్రకటిస్తే బలవంతపు విఆర్ఎస్ అమలుకు కేసియార్ రెడీ అవుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఇదే లేబర్ కోర్టు సమ్మె చట్టబద్ధమే అని చెబితే అప్పుడేం చేస్తారు ? ఎందుకంటే సమ్మె చట్టబద్ధమే అని ఇప్పటికే హై కోర్టు ప్రకటించింది కదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: