వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే డాక్ట‌ర్ శ్రీదేవి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా న్యాయ‌ప‌ర‌మైన చి క్కు కావ‌డంతో రాజ‌కీయంగా వైసీపీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఎస్సీ ని యోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన శ్రీదేవిని ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు మాసాల ముందు ఇక్క‌డ ఇంచార్జ్‌గా నియ‌మించి, టికెట్ ఇ చ్చింది. ఆమె గెలుపు గుర్రం ఎక్కారు. వైద్య విద్య‌ను చ‌దివిన శ్రీదేవి.. హైద‌రాబాద్‌, గుంటూరులో నూ కార్పొరేట్ వైద్య‌శాల‌ను స్థాపించి వైద్యం అందిస్తున్నారు.

 

అయితే, జ‌గ‌న్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితులు కావ‌డంతో ఆమెను రాజ‌కీయంగా ప్రోత్స‌హించారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే అయిన శ్రీదేవి .. మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నించి వార్త‌ల్లోకి ఎక్కారు. అ యితే, జ‌గ‌న్ ఆమెకు ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అధికార ప్ర‌తినిధిగా ఆమెను నియ‌మిం చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆది నుంచి కూడా శ్రీదేవి వివాదాల‌కు కేంద్రంగా మారారు. స్థానికంగా గ్రానైట్ వ్యాపారులు ఉండ‌డంతో వారికి టార్గెట్లు పెట్టి క‌ప్పం కట్టాల‌ని నిర్దేశించ‌డం, వారంతా వైసీపీ నాయ‌కుల‌కు ఫిర్యాదు చేయ‌డం, ఇవి వార్త‌ల్లో రావ‌డం తెలిసిందే.

 

ఇక‌, ఆ త‌ర్వాత కూడా చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీతోనూ ఆధిప‌త్య పోరుకు తెర‌దీశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ఆమెను ఆహ్వానించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. వినాయ‌క మండపానికి వెళ్లిన త‌న‌ను కులం పేరుతో దూషించార‌ని వ్యాఖ్యానించి టీడీపీపై విమ ర్శ‌లు గుప్పించారు. ఇక‌, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌తోనూ ఆమెకు ఇసుక వివాదాలు, నియ‌జ‌కవ‌ర్గంలో వేలు పెడుతున్నాడ‌నే ర‌గ‌డ ఉన్న విష‌యం తెలిసిందే. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గా ఇప్పుడు కొత్త వివాదంలో శ్రీదేవి చిక్కుకున్నారు.

 

తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అదే సామాజిక వర్గ కోటాలో పోటీ చేసి గెలుపొందిన తాడికొం డ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదంటూ రాష్ట్రపతికి లీగల్ రైట్స్ ఫోరం ఫిర్యాదు చేసింది. నివేదిక ఇవ్వా లని సీఎస్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. 26న విచారణకు హాజరుకావాలని తాడికొండ ఎమ్మె ల్యే శ్రీదేవికి గుంటూరు జిల్లా జేసీ ఆదేశాలు పంపారు. ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రా లు, ఆధారాలతో విచారణకు రావాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్‌ ఎమ్మెల్యేకు సూ చించారు. మ‌రి ఈ నేప‌థ్యంలో శ్రీదేవి ఈ కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: