తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రభుత్వం చేతులెత్తేయగా, తాజాగా హైకోర్టు కూడా వారి సమస్యను లేబర్ కోర్టుకు అప్పగించింది. ఇప్పటి వరకు మరణించిన కార్మిక కుటుంబాలకు ఇకముందు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న బాధిత కుంటుంబీకుల్లో ఇప్పుడు ఉదయిస్తుంది. ఈ మాత్రం పరిష్కారం కాని దానికి కార్మిక సంఘాలు ఇన్నాళ్లుగా సమ్మె అంటూ ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందా? అని అనుకుంటున్నారు.

 

 

ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆర్టీసీని ఏ రకంగా ఆదుకునే పరిస్దితి కనబడటం లేదు. రోడ్డున పడ్ద కార్మిక కుటుంబాల బాధ్యత ఇప్పుడు ఎవరు వహిస్తారు. ఈ సమ్మెవల్ల అటూ ప్రభుత్వం కాని, ఇటూ కార్మిక సంఘాలు గాని సాధించిన అభివృద్ది ఏంటి? ఇంకా ఆర్టీసీ పరిస్దితి అధ్వానంగా తయారై నష్టాల్లో కూరుకు పోయింది.

 

 

ఈ దశలో జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ సమ్మెపై మంగళవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని, హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత కార్మికులతో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తామని ప్రకటించారు. మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని కోర్టు తీర్పును గౌరవిస్తూ, వాయిదా వేస్తున్నామని తెలిపారు.

 

 

ఇందుకు గాను ప్రభుత్వం, యజమాన్యం, కార్మికుల మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇకపోతే కార్మికులను చర్చలకు పిలచి, సమస్యలు పరిష్కరించాలని, కోరుతూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి రెండు రోజులుగా చేస్తున్న దీక్షను  సోమవారం విరమించారు. ఇక అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో తీర్పు వెల్లడైందని, తమ డిమాండ్లను రెండు వారాల్లోగా పరిష్కరించాలని సర్కారును ఆదేశించిందని  మీడియాకు తెలిపారు.

 

 

అంతే కాకుండా సమ్మె ఇల్లీగల్ అని తాము ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ  మేరకు భవిష్యత్​ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు ఆర్టీసీలోని అన్ని యూనియన్లు మంగళవారం విడిగా కేంద్ర కమిటీల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కార్మిక నేతలందరు ఎల్బీనగర్‌లోని హిమగిరి గార్డెన్‌కు చేరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: