ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో మొన్న‌టి వ‌ర‌కు ఇసుక అంశం రాజ‌కీయ తుఫానును సృష్టిస్తే...తాజాగా ఇంగ్లీష్ మీడియాన్ని నిర్బంధ విద్య విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో మ‌రో రాజ‌కీయ ర‌చ్చ‌కు తెర‌లేసింది. రస్వతీదేవిని పూజించని వారే ఇలా ఆంగ్ల బాష కోరుకుంటున్నారని అంటున్నారు. ఇంగ్లీష్ విద్యా బోధన అంటే పూర్తిగా క్రైస్తవ మత ప్రచారమేనని కూడా ఘాటైన పదజాలమే ఉపయోగిస్తున్నాయి.

 

తెలుగును ఖూనీ చేయ‌డానికే వైసీపీ ప్ర‌భుత్వం ఇంగ్లీష్ విద్య‌ను అమ‌లుకు ఆదేశాలు జారీ చేస్తోంద‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అయితే టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు మంత్రులు కౌంట‌ర్ ఇచ్చే ప‌నిలో ప‌డ్డారు.  ఇంకెన్ని త‌రాల భ‌విష్య‌త్‌ను నాశ‌నమ‌య్యే వ‌ర‌కు చూస్తారంటూ వైసీపీ ముఖ్య‌నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొడుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కొంత‌మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంగ్లీష్ భాష రాక‌పోవ‌డం వ‌ల‌న త‌మ ప‌రిస్థితి ఎలా త‌యారైంది స్వ అనుభావాల‌ను మీడియా ఎదుటే వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.  

 

వైసీపీ క్యాబినేట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తనకు ఇంగ్లీష్ రాదని ఒప్పేసుకున్నారు. నాచ‌దువంతా తెలుగు మీడియంలో సాగింది. ఎంత ప్ర‌య‌త్నించినా ఇంగ్లీష్ ఒంట‌బ‌ట్ట‌లేదని బాధ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికీ అధికారులు మాట్లాడుతున్న‌ప్పుడు కొన్ని ప‌దాలు అర్థం కావ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదే నేను ఇంగ్లీష్ మీడియంలోనే చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దివితే నా పొలిటిక‌ల్ కెరీర్ ఇంకా బాగుండేద‌ని అనుకుంటున్నాను అంటూ ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పాశారు.

 

జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న పుష్ప శ్రీవాణి సైతం ఇంగ్లీష్ తనకు రాదని చెప్పుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఆంగ్ల భాషపై పట్టు లేకపోవడం తనకు ఉప ముఖ్యమంత్రిగా ఇబ్బందిగానే ఉందని పేర్కొన్నారు. మరి వైసీపీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో ఎంతమందికి ఆంగ్లంలో చదవడం, రాయడం వచ్చో కూడా ముఖ్యమంత్రి జగన్ చెక్ చేసుకోవాలని సోష‌ల్ మీడియాలో జ‌నాలు కామెంట్లు రాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: