ఏపీ సచివాలయం నుండి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మొత్తంగా బార్లను తీసేసి కొత్తగా లైసెన్స్ లు ఇచ్చే బార్లలో ఇప్పుడు ఉన్న వాటిలో 40 శాతం బార్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని నారాయణ స్వామి తెలిపారు. జనవరి నెల 1వ తేదీ నుండి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు నారాయణ స్వామి చెప్పారు. బార్లు సరఫరా చేసే మద్యం ధరలను కూడా ప్రభుత్వం పెంచే ఆలోచన చేస్తోందని నారాయణ స్వామి చెప్పారు. 
 
మద్యం కల్తీ చేసినా, స్మగ్లింగ్ చేసినా, నాటు సారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని కూడా నారాయణస్వామి హెచ్చరించారు. త్వరలో ఇందుకు సంబంధించిన చట్టాన్ని కూడా తీసుకొనిరాబోతున్నట్లు నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం బార్లను తీసివేసి కొత్త బార్లకు లాటరీ పద్దతి ద్వారా లైసెన్స్ లు ఇచ్చేలా చర్యలు తీసుకోబోతున్నామని నారాయణస్వామి తెలిపారు. 
 
బార్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజుకు మూడు రెట్లు అధికంగా జరిమానా విధిస్తామని బార్ల లైసెన్స్ లను రద్దు చేస్తామని నారాయణస్వామి తెలిపారు. ప్రతిపక్షనాయకులు కూడా మద్యపాననిషేధానికి సహకరించాలని నారాయణస్వామి చెప్పారు. వేలం పెడితే సిండికేట్ అవుతారని లాటరీ పద్ధతి ద్వారా అక్రమాలు జరగవని నారాయణస్వామి తెలిపారు. 
 
838 బార్లలో 40 శాతం బార్లను తగ్గిస్తున్నామని సీఎం జగన్ 50 శాతం తగ్గించాలని కోరుకుంటున్నారని నారాయణస్వామి తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న బార్లను మొత్తం తొలగిస్తున్నామని సిండికేట్ అనేది లేకుండా ఎవరైనా కొత్త బార్లకు ధరఖాస్తు చేసి తీసుకోవచ్చని తెలిపారు. బార్లలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణస్వామి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: