హైదరాబాద్ లో మెట్రో రైలుకు కు రోజురోజుకీ విశేష ఆదరణ లభిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులే కాదు.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల నుండి గమ్యానికి సులువుగా చేరుకోవడంతో పాటు.. సమయం ఆదా అవుతుందనే భావనతో ఈ ట్రైన్ వైపు మొగ్గుచూపుతున్నారు. కాస్త ఛార్జీ ఎక్కువైనా పర్వాలేదు కానీ.. టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీంతో మెట్రో రైలు సర్వీసుల ద్వారా ఆ సంస్థకు భారీ ఆదాయం లభించింది. 

 

ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణీకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మియాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్ లలో ఉద్యోగాలు చేసే వారికి వాహన సదుపాయాల కొరత ఏర్పడింది. అయితే మెట్రై రైళ్లు వీరికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. చూద్దాం.. మెట్రో ట్రైన్ ప్రయాణం ఎలా ఉంటుందో.. అని ఒక్కసారి ట్రైన్ ఎక్కి జర్నీ చేసిన వాళ్లు.. అదే మార్గాన్ని కొనసాగిస్తున్నారు. గత ఒకటిన్నర నెల కాలంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో మెట్రో రైళ్లకు విశేష ఆదరణ లభించింది. ఆ సంస్థకు ఎపుడూ లేనంత ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.  


భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అన్ని వర్గాల ప్రజలు మెట్రో సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.  దీంతో మెట్రో రైల్‌ ఖజానా కాసులతో గలగలలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులతో ఆదాయం భారీగా సమకూరుతోంది. గతంతో పోలిస్తే గడిచిన నెలన్నరలో మెట్రోకు సుమారు 20 కోట్లకు పైగా అదనపు రాబడి లభించింది. 


మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వంటి దూర ప్రయాణం చేసే సాధారణ ప్రయాణీకులు మెట్రో జర్నీ వైపు ఆసక్తి చూపుతున్నారు.  చూపుతున్నారు. ఇక హైటెక్ సిటీ మార్గాల్లో రివర్సల్‌ సిస్టమ్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌, నాగోల్ నుంచి హైటెక్ సిటీకి ఇలా రెండు కారిడార్ లలో నడుస్తోంది.  ఇందులో మరీ ముఖ్యంగా అమీర్ పేట నుంచీ హైటెక్ సిటీకి రోజూ వేలాదిమంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. 


హైటెక్ సిటీ రూట్ మెట్రో అధికారులు రివర్సల్‌ సిస్టమ్‌ అందుబాటులోకి రావడంతో.. హైటెక్ సిటీ వద్ద మెట్రో యూ టర్స్ తీసుకొనే అవకాశం కలిగింది. దీంతో అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుస్తోంది. ప్రస్తుతం మెట్రో రైలు ప్రతి నాలుగు నిమిషాలకు ఒకటి వచ్చేది.. భవిష్యత్తులో ప్రతి మూడు నిమిషాలకు ఓ ట్రైన్ నడిచేలా చేస్తామని చెబుతున్నారు మెట్రో రైలు అధికారులు. ఏసీని సైతం సౌకర్యంగా ఉండేలా 23 డిగ్రీలకు తగ్గించారు. మొత్తానికి మెట్రో ప్రయాణం సుఖంగా, వేగంగా జరుగుతుండటంతో.. రోజు రోజుకీ భాగ్యనగర వాసులు.. మెట్రో ప్రయాణానికే ఆసక్తి చూపిస్తున్నారు. రాయదుర్గం స్టేషన్‌, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాలు పూర్తయితే… రాబడి మరింత పెరిగే అవకాశముంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: