మహారాష్ట్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత శివసేన బీజేపీ రెండు పార్టీలు సీఎం సీటును చెరిసగం పంచుకోవాలని శివసేన షరతులు విధించగా బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గవర్నర్ సిఫారసు మేరకు కొనసాగుతోంది. 
 
పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ విలేకరులతో మాట్లాడుతూ శివసేన మంత్రి ఎన్డీయే ప్రభుత్వం నుండి వైదొలిగారని ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని చర్చించారని అందువలన రెండు సభల్లో వారికి ప్రతిపక్షాలకు చెందిన సీట్లను కేటాయించడమే సహజమని వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఎన్డీయే నుంచి తొలగించినట్లు చెప్పటంతో  శివసేన పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 
శివసేన పార్టీ తమ అధికార పత్రిక సామ్నా ద్వారా విమర్శలు చేసింది. శివసేన హిందుత్వ సిద్ధాంతాలకు ప్రస్తుతం బీజేపీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులెవరూ జన్మించని కాలంలోనే మద్దతుగా నిలిచిందని వ్యాఖ్యలు చేసింది. ఇతర పార్టీలతో చర్చలు జరిపినంత మాత్రాన ఎన్డీయే నుండి తొలగించటం సరైన నిర్ణయం కాదని శివసేన అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విమర్శలు చేసిన జమ్మూకశ్మీర్ పీడీపీ, బీహార్ ముఖ్యమంత్రిని నితీష్ ను చేర్చుకునే సమయంలో ఇతర పక్షాల్ని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. 
 
శివసేన పార్టీ మాత్రమే ఎవరూ ప్రధాని మోదీకి మద్దతుగా నిలవని కాలంలో మద్దతుగా నిలిచిందని శివసేన పార్టీ గుర్తు చేసింది. బీజేపీ పార్టీ నాయకులంతా చరిత్రను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని శివసేన పేర్కొంది. మోదీగా అండగా నిలిచిన శివసేన పార్టీని బాల్ ఠాక్రే వర్ధంతి రోజున తొలగిస్తున్నామని ప్రకటన చేయటాన్ని ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: