జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో కొన్ని కొన్ని సార్లూ వాహనదారులకు చుక్కలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పండగ సమయాల్లో అయితే గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్దితి వస్తుంది. ఇది వాహనదారులకు అతి పెద్ద సమస్యగా తయారైంది. ఇలాంటి సమస్యల వల్ల  వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద కలుగుతున్న అసౌకర్యాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది.

 

 

ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. అదేమంటే జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో ఇప్పుడు ఫాస్టాగ్‌లను అంగీకరిస్తారు. ఇకపోతే ఈ నిబంధన డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని సమాచారం.. ఇప్పటివరకు  400కు పైగా దేశవ్యాప్తంగా ఉన్నా టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్‌లను అంగీకరిస్తున్నారు. అతి త్వరలోనే ఇతర టోల్ ప్లాజాలలోనూ ఇదే విధానం అమలులోకి రానుంది.

 

 

దీంతో వాహనదారులు వెహికల్‌ను నిలిపి క్యాష్ రూపంలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఇకనుండి ఉండదు అన్న మాట. ఇక ఇందుకు గాను ప్రతి వేహికిల్ అద్దం పై రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ అయిన ఫాస్టాగ్‌ను అతికిస్తారు. దీంతో టోల్ చార్జీలు వాటంతట అవే ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఇక ఈ నిర్వహణ బాధ్యతలను ఎన్‌హెచ్ఏఐకు చెందిన ఎలక్ట్రానిక్ టోలింగ్, ఇతర ప్రాజెక్టులను చూసుకునే ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ చూసుకుంటోంది.

 

 

ఇదే కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వంటి వాటితో ఫాస్టాగ్‌ను మళ్లీ రీలోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సులువైన పని. అంతేకాకుండా నేషనల్ హైవేస్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా నిర్వహించే లావాదేవీలపై 2.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఒక క్యాష్ బ్యాక్ ఆఫరే కాకుండా కాకుండా కొన్ని బ్యాంకులు రూ.లక్ష వరకు యాక్సిడెంటల్ డెత్ కవర్ కూడా అందిస్తున్నాయి.

 

 

ఈ భీమా ఒక వెహికల్ నడుపుతున్న డ్రైవర్లకు మాత్రమే వర్తిస్తుంది. కాగా ఫాస్టాగ్ అకౌంట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ సమాచారం కస్టమర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి వస్తుంది. ఈ విధానం వల్ల టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం అవ్వకుండా టైమ్ సేవ్ అవుతుంది. అంతేకాకుండా పెట్రోల్ లేదా డీజిల్ కూడా ఆదా అవుతుంది. ఇక వాహనదారులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా ఆన్‌లైన్‌ మార్గంలో ఫాస్టాగ్‌ పొందొచ్చు... 

మరింత సమాచారం తెలుసుకోండి: