ప్రజా నాయకుడు ఆదర్శ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన గాడిలో పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. మాకు జగనన్న లాంటి  సీఎం  కావాలంటూ  పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం నినదించే లా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పాలనను అందించేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంక్షేమం  రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నో వినూత్న పథకాలకు ఊపిరి పోస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పొరుగు రాష్ట్రాల ప్రజలు ఔరా   అనిపించేలా పాలన సాగిస్తున్నారు. 

 

 

 

 అంతేకాకుండా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు పెద్ద పీట వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని రైతులందరికీ చేయూతనిచ్చేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి రైతుకు ఏడాదికి 13, 500 రూపాయలు తమ తమ ఖాతాల్లో జమ చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని రైతులందరి ఖాతాల్లో  మూడు దఫాలుగా వైఎస్సార్ రైతు భరోసా పథకం సొమ్ము జమ చేయనున్నట్లు వెల్లడించారు. 

 

 

 

 ఇది కేవలం పట్టా  ఉన్న రైతులకు మాత్రమే చెందుతుందని కౌలు రైతులకు వర్తించదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిబంధన విధించిన విషయం తెలిసిందే.తాజాగా  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కేవలం పట్టా రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం  జరుగుతుందని నిబంధనను తొలగిస్తూ కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దేవాదాయ భూముల కౌలు రైతులు,  సొసైటీలో రైతులకు ఈ పథకం వర్తించనుంది అని  జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 45 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరుతుందని జగన్ సర్కార్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. అయితే దేశంలోని తొలిసారిగా కౌలు రైతులకు కూడా పంట పెట్టుబడి సాయం అందించనున్నామని  తెలిపారు ఈ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: