రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో  చంద్రబాబు పాలన వలన రైతులందరికీ నష్టం జరిగిందని...జగన్ పార్టీ అధికారంలోకీ  వచ్చిన తర్వాత రైతులందరూ సంతోషంగా ఉన్నారంటూ ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ శాఖలో ఉన్న  ప్రతి వర్గానికీ కూడా సమ  న్యాయం చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారంటూ మోపిదేవి అన్నారు. అన్ని కుల వృత్తుల వారికి చేయూతను అందిస్తూ సమన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో  రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మోపిదేవి అన్నారు. 

 

 

 

 జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ వృత్తుల వారికి పెద్దపీట వేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతినెల వ్యవసాయ శాఖ పై సమీక్షలు నిర్వహించి  వ్యవసాయ శాఖ స్థితిగతులను తెలుసుకొని అభివృద్ధికి పాటుపడుతున్నట్లు   ఆయన మోపిదేవి తెలిపారు . టిడిపి అధినేత చంద్రబాబు నిర్వాకం వల్లే రాష్ట్రంలో విత్తనాల కొరత ఏర్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేస్తుంటే చంద్రబాబు చూసి ఓర్వలేక పోతున్నారు అంటూ మోపిదేవి విమర్శలు గుప్పించారు. అందుకే జగన్ ప్రభుత్వం పై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత  ఏర్పడినప్పటికీ ఆ సమస్యను అధిగమించినట్లు  మోపిదేవి తెలిపారు. 

 

 

 

 ఒక నెల 25 నుంచి వేరుశనగ కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా  ఏర్పాటు చేస్తామని మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని... రైతులందరూ దళారీల బారినపడి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వేరుశనగలు విక్రయించాలని  సూచించారు.కొనుగోలు  కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారుల పర్యవేక్షణలో వేరుశనగ కొనుగోలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: