చంద్రబాబు అంటే స్టేల చక్రవర్తి అంటారు గిట్టనివారు. అది నిజమేనంటారు అయిన వారు కూడా బాబు ఏకంగా 18 కేసులో స్టేలు తెచ్చుకున్నారు. అవన్నీ యుగాలు జగాలు గడచిపోయినా అలాగే పడున్నాయి. అందులో నుంచి ఇపుడు ఒక కేసు స్టేను దాటి మరీ ముందుకు వచ్చి బుస కొడుతోంది. మరి బాబు విషయంలో మిగిలిన స్టేల సంగతేంటి.  వాటి కధ ఎక్కడ వరకూ ఉంది. వెలికితీసే అని మొదలైందా. 

 

బాబుకు బ్యాడ్ డేస్ అన్నీ తరుముకువస్తున్నాయా అంటే తమ్ముళు అయోమయంగా తలలు ఊపుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు తాజా ఎన్నికల్లో  ఘోరంగా ఓడిపోవడమే అసలైన షాక్. ఆ తరువాత ఎన్ని షాకులు వచ్చినా దాని కంటే చిన్నవే. ఇపుడు లక్ష్మీ పార్వతి చంద్రబాబు పై అక్రమాస్తుల కేస్తులో  స్టేను ఏసీపీ ప్రత్యేక న్యాయ స్థానం కొట్టేసింది. దాంతో ఇపుడు ఈ కేసు జోరుగా విచారణ జరగనుందంటున్నారు. 

 

ఇదే వరసలో మరిన్ని స్టేలపైన కూడా కదిలించి తమాషా చూడాలని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారు. అందులో ముందుగా వెలికి తీసేది ఏలేరు స్కాం. ఇది 1995 ప్రాంతంలో జరిగింది. ఆనాడి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పక్ష నేత పి జనార్ధనరెడ్డి కోర్టులో కేసు వేశారు. దాని మీద కోర్టుకు వెళ్ళి మరీ స్టే తెచ్చుకున్నారు చంద్రబాబు. ఆ తరువాత ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆ కేసు వూసు లేదు.

 


ఇక 2014 ముందు ఏలేరు స్కాం మీద శాఖాపరనమైన విచారణకు కోర్టు ఆదేశించింది. అయితే నవ్యాంధ్రకు సీఎం గా వచ్చిన బాబు దీని మీద విచారణను తూతూమంత్రంగా ముగించారని అంటారు.  ఇపుడు అధికారంలో ఉన్నారు. అందువల్ల తప్పకుండా కచ్చితంగా ఏలేరు స్కాంలో మళ్ళీ విచారణ చేసి బాబు సర్కార్ నాటి దోషులను బయటపెట్టాలనుకుంటున్నారుట. పనిలో పనిగా బాబు కేసులో మిగిలిన కేసుల బూజు లపాలనుకుంటున్నారుట. ఇక చంద్రబాబు విషయంలో జగన్ సర్కార్ దూకుడు మీద ఉంది, కేంద్రం ఏమంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: