ఏపీలో జగన్ అధికారంలోకి వస్తాడని కలలో కూడా ఊహించుకోని ఎల్లో మీడియా ఇపుడు మల్లగుల్లాలు పడుతోంది. ఏదో విధంగా ప్రతీ రోజూ జగన్ సర్కార్ మీద బురద జల్లే కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తూ అందులోనే త్రుప్తి పడుతున్న ఎల్లో మీడియాకు ఇపుడు కొత్త ఆలోచన వచ్చిందట. అదేమంటే యాగం చేయాలని. నాడు అశ్వమేధ యాగం రాముడు చేశాడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు. మరి ఈ యాగం కధా కమామిషూ ఏంటంటే...

ఇంగ్లీష్ బోధన అంటే మత మార్పిడి అన్నది జనాలకు ఎలాగైనా చేరవేయాలి, ఏపీలోని అన్ని కులాలు జగన్ కి  మద్దతు తెలిపిన వేళ ఇక కులాల కుంపట్లకు తావు లేదు, అందుకు మతం కార్డు ఒక్కటే మార్గం. హిందూ కార్డు తీయడమే శరణ్యం. ఇపుడు ఇంగ్లీష్ కి మతానికి ముడి పెడుతూ వార్తలను వెల్లువలా వండి వార్చేస్తోంది ఎల్లో మీడియా.  ఇంగ్లీష్ అందుకోసమేనంటూ ఊహాజనిత కధనాలతో ఏపీలో ఏదో జరిగిపోతోందని సీన్ క్రియేట్ చేస్తోంది.

 

మరో వైపు తెలుగు భాష చచ్చిపోతోందంటూ ఎల్లో మీడియా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తూ వస్తోంది. వాటిని తన మీడియాలో అచ్చేసి జగన్ని బదనాం చేస్తున్నామని సంబరపడుతోంది. తెలుగును ఏపీలో చంపేస్తున్నారు అంటూ పెద్ద ఉద్యమానికే రెడీ అయ్యేట్లుగా కనిపిస్తోంది. అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ పాలనలో సారాయి వ్యతిరేక ఉద్యమానికి ఎలాంటి ముడిసరుకు అందించిందో ఇపుడు అదే తరహాలో అగ్గి రాజేసేందుకు చూస్తోంది. 

 

ఇలా  మతాన్ని భాషకు  అంటు కట్టి చేస్తున్న ఈ చేష్టలు విక్రుత పోకడలు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో ఎల్లో మీడియాకు మాత్రమే తెలియాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిపై అక్రమాస్తుల కేసు స్టే పక్కకు పోయి మరీ చాలాకాలానికి  విచారణకు వచ్చిందంటే దానికి మొదటి పేజీలో అచ్చేయాల్సిన వార్తగా అనిపించకపోవడం, మరో వైపు గుండెలు బాదుకుంటున్న తెలుగు బాధ, హిందూ మతం పై పొంగి పొరలుతున్న ప్రేమ ఇవన్నీ చూస్తూంటే టీడీపీ కంటే కూడా ఎల్లో మీడియాను ఈ ఓటమి ఎంతగా బాధపెడుతోందో అర్ధమైపోతోందికదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: