ప్రస్తుతం అధికార వైసీపీ పార్టీలో కొత్త పంచాయతీ మొదలైనట్లు కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహలు ప్రణాళికలపై... వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి సమక్షంలో ఎంపీలందరూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల తీరుపై ఎంపీలు అందరు  అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీల సమావేశం హాట్ హాట్  జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరితో తమకు కూడా సమాన హక్కు కల్పించాలంటూ ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులందరూ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల తీరుపై తాము  అసంతృప్తిగా ఉన్నట్లు విజయసాయి రెడ్డి దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

 

 

 ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు అంటూ పలువురు పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడ్డట్లు  తెలుస్తోంది. దీంతో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పటికీ  ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేలు అనుమతి తీసుకోవాల్సి వస్తుందంటూ  పలువురు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పలు నియోజకవర్గాల్లో  ఎమ్మెల్యేలు ఎలాంటి పనులు చేయకుండా తమను  అడ్డుకుంటూన్నారంటూ వైసీపీ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు సభ్యులను అయనప్పటికీ తమను  ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడం లేదంటూ విజయ సాయి రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ఎంపీలు . అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు  ఇచ్చిన  ప్రోటోకాల్ ను   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మాకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఇంకొంతమంది ఆరోపించినట్లు  కూడా తెలుస్తుంది . 

 

 

 

 అంతేకాకుండా నామినేటెడ్ పదవులల్లో  ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ  ఎంపీలు విజయసాయిరెడ్డిని కోరారట. కేవలం ఎమ్మెల్యేలతో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే ఇంకా తాము ఉండడం ఎందుకంటూ  కొందరు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారట.  అయితే ఈ సమావేశంలో ఎంపీలు ఆరోపణలు అన్నీ విన్న విజయసాయిరెడ్డి... అన్ని అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్తానని ఎంపీలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి వ్యూహాలు ప్రణాళికలను అమలు చేయాలనే దానిపై కూడా ఈ సందర్భంగా ఎంపీలకు విజయసాయిరెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. కాగా  ఒకవేళ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని జగన్ దగ్గర చేరిస్తే  జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారు అన్నది కూడా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: