ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వచ్చిన సమయం నుంచి సంచలన నిర్ణయలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రజలందరికీ ఉపయోగ పడే పథకాలు అమలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా జగన్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 


 
మందుబాబులకు మరో షాక్ ఇవ్వాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆంధ్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న మద్యం దుకాణాలను 20 శాతానికి పైగా ప్రభుత్వం తగ్గించింది. 

 

అలాగే మద్యం దుకాణాల వేళలను కూడా తగ్గించింది. ఇప్పటి వరకు ఉన్న మద్యం దుకాణాల పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లను ఎత్తివేసింది. మద్యం వినియోగాన్ని క్రమంగా తగ్గించేందుకే మద్యం షాపులను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా ఇప్పటి వరకు మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించిన ఏపీ ప్రభుత్వం బార్‌‌లను కూడా తగ్గించాలని నిర్ణయించింది. 

 

ఈరోజు సచివాలయంలో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న బార్లను 50 శాతానికి తగ్గించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం. స్టార్ హోటళ్లు మినహా బార్లను 40 శాతానికి తగ్గించనున్నారు. రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు మినహా 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

 

అంతే కాదు మందుబాబులకు మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇప్పటివరకు మద్యం షాపులలో రేట్లు భారీగా పెంచినట్టే బార్లలో మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా మద్యం షాపు వేళలు కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకు మాత్రమే విక్రయాలు జరగగా, స్టార్ హోటళ్లలో రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: