తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కు సరిపడా సీట్లు కూడా గెలవలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ పిసిసి అధ్యక్షుడు మార్పు అంశం తెరమీదకి వచ్చింది. టిపిసిసి పదవిలో  ఉత్తమ్ కుమార్ రెడ్డి  సరైన వ్యక్తి కాదు కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ రాణించలేక పోతోంది అంటూ ఆరోపణలు  కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా... టిపిసిసి పదవిని దక్కించుకోవాలని ప్రయత్నలు చేసిన  విషయం తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ అధిష్ఠానం కూడా టిపిసిసి పదవిలో కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉందని... ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి టిపిసిసి  పదవి కట్టబెట్టే యోచనలో  ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కాస్త చురుకుగా పని చేయడంతో కాంగ్రెస్ లో ముసలం ఏర్పడింది కూడా . కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ టీపీసీసీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సపోర్ట్ చేయగా...  తాత్కాలికంగా కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవి మార్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే అటు కాంగ్రెస్ సీనియర్ నేత లోనూ టిపిసిసి పదవిని  దక్కించుకునేందుకు చాలా మంది  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా టీపీసీసీ  పదవిని దక్కించుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు,  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  జగ్గారెడ్డి  తదితరులు నేడు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సంగారెడ్డి శాసన సభ్యులు జగ్గా రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం కాంగ్రెస్ టీపీసీసీ పదవి కోసం రెడ్డి వర్గానికి చెందిన పది మంది నాయకులు పోరాడుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. అయితే ఇప్పట్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం తెలంగాణలో లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

 

 టీ పీసీసీ పదవిలో  ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని పార్టీ సీనియర్ నేతలు అందరూ అనుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒకవేళ తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి మార్పు  అనివార్యమైనప్పుడు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు తనకు మద్దతు ఇవ్వాలంటూ జగ్గా రెడ్డి కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం పై కూడా విమర్శలు గుప్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కెసిఆర్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్టు జగ్గా రెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ప్రజలందరూ వద్దనుకుంటున్నారని .. కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు,

మరింత సమాచారం తెలుసుకోండి: