అత్యవసర సమయాల్లో అనుకున్న చోటుకు అనుకున్న టైం కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చని ఈ మధ్యకాలంలో చాలా మంది క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్యాబ్‌లు వచ్చినప్పటి నుండి చాలా మంది ఉద్యోగులకు గాని లేదా ఎటైన నగరంలో పనిమీద బయటకు వెళ్లాలంటే ఉన్నచోట నుండే బుక్ చేసుకుంటే పికప్ చేసుకునే వెలుసు బాటు ఉంది కాబట్టి జనాలు ఎక్కువగా రోడ్లమీదకు రాకుండానే తమ పనులు  ఈ రవాణా వ్యవస్దవల్ల చక్కబెట్టుకుంటున్నారు..

 

 

ఇందులో కొందరు డ్రైవర్లు నిజాయితీ పరులుంటే మరికొందరు అతి తెలివి పరులు ఉంటున్నారు. ఇలాంటి వారికి ఇక్కడ జరిగిన ఈ సంఘటన హెచ్చరిక లాంటింది. ఇక అన్ని సందర్భాల్లో అనువుగా ఉండే క్యాబ్‌లు ఒక్కోసారి చికాకు తెప్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో క్యాబ్ సేవలు తెప్పించే చిరాకు ఎంతలా ఉంటుందంటే భరించలేనంతలా తలనొప్పిగా తయారవుతుంది. కొందరు డ్రైవర్లు  ఎక్కువ దూరం ప్రయాణిస్తే చార్జీ ఎక్కువగా వస్తుందనే ఆలోచనతో ట్రాఫిక్ జామ్ ఉందంటూ ఆలస్యం చేస్తుంటారు.

 

 

అలాగే ఓ క్యాబ్ డ్రైవర్ తన ప్రయాణికుడిని సమయానికి రైల్వేస్టేషన్‌ కు తీసుకుపోవడంలో విఫలం అవగా వినియోగదారుల ఫోరం అతనికి భారీగా జరిమానా విధించింది. నగరంలో జరిగిన ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కేవీ వరప్రసాద్ 2016 సెప్టెంబర్ 19న కాకినాడకు వెళ్లేందుకు తన కుటుంబంతో కలిసి డాట్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ డ్రైవర్ వారి ఇంటివద్ద నుండి సికింద్రాబాద్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్ జాం ఉందంటూ నగరం అంతా తిప్పుకుంటూ ఆలస్యంగా రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు.

 

 

అప్పటికే  వారు ఎక్కవలసిన కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తమ ప్రయాణం వాయిదా పడిందని ఆగ్రహం వ్యక్తం చేసిన వారు గత్యంతరం లేక మరుసటి రోజు విమానంలో వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అసౌకర్యంపై వినియోగదారుల ఫోరంలో ఆ వ్యక్తి కేసు వేశాడు.

 

 

దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం జడ్జి ఇది డ్రైవర్‌ సేవాలోపమేనని, ఇందుకు గాను పరిహారంగా  ప్రయాణికుడు వరప్రసాద్‌కు విమాన చార్జీలు రూ. 31,567 తో పాటు ఇతర ఖర్చుల కోసం మరో 20వేలతో అంతా కలిపి రూ. 51,567 వేలు క్యాబ్ డ్రైవర్ చెల్లించాలని ఆదేశించింది. అతి ఆశ అతని ఉద్యోగానికే గాక అతని జేబుకు పెద్ద చిల్లు పెట్టింది. ఇక ఈ తీర్పు నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు పనిగట్టుకొని ఆలస్యం చేసినా.. నాణ్యమైన సేవలు అందించకపోయినా వాత తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: