రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశంపార్టీని ప్రత్యేకించి చంద్రబాబునాయుడును ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని రెడీ చేశారట. ఆ అస్త్రం పేరే వల్లభనేని వంశీమోహన్. ప్రస్తుతానికి వంశీ టిడిపి గన్నవరం ఎంఎల్ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత వంశీ ఎన్నో రోజులు టిడిపిలో కంటిన్యు అయ్యే అవకాశాలు లేవు.

 

ఇప్పటికే వంశీకి షోకాజ్ నోటిసు ఇచ్చిన టిడిపి ఎంఎల్ఏ సస్పెన్షన్ కు రంగం రెడీ చేసింది.  సస్పెన్షన్ తర్వాత అనర్హత వేటుకు కూడా రెడీ అవుతోందని సమాచారం. చంద్రబాబు, లోకేష్ అండ్ కో ను ఎంఎల్ఏ అమ్మనా బూతులు తిడుతున్నారు. అందుకని రేపటి అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి సభ్యునిగా కాకుండా సభలో విడిగా కూర్చుంటారని సమాచారం.

 

వంశీపై  అనర్హత వేటు వేయాలని టిడిపి కోరుకున్నా ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు. టిడిపి ఫిర్యాదుపై ఎంఎల్ఏను కూడా స్పీకర్ వ్యక్తిగతంగా పిలిపించి విచారిస్తారు. కాబట్టి ఈ సమావేశాల వరకూ వంశీ ఎంఎల్ఏగా ఉండటం ఖాయం. ఇండిపెండెంట్ హోదాలో వంశీ అసెంబ్లీలోకి అడుగుపెడితే ఇంకేమన్నా ఉందా ?

 

చంద్రబాబు అండ్ కో ను వంశీ అసెంబ్లీలో దుమ్ము లేపేయటం ఖాయం. సమావేశాల్లో ఇసుక కొరత,  భవన కార్మికుల ఆత్మహత్యలు, ఇంగ్లీషు మీడియం తదితరాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టిడిపి వ్యూహం రచిస్తోంది. టిడిపి వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు  ముఖ్యమంత్రి ఎలాగూ సిద్దంగానే ఉంటారు. జగన్ వ్యూహానికి బోనస్ గా వంశీని చంద్రబాబు మీద ప్రయోగించటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

అంటే టిడిపి సభ్యుల మీదకు జగన్ టిడిపి సభ్యుడినే ప్రయోగించబోతున్నట్లు అర్ధమైపోతోంది. మరి జగన్ వ్యూహాన్ని చంద్రబాబు ఎదుర్కోగలరా ? అవకాశాలైతే తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే, చంద్రబాబు అంటేనే వైసిపి మంత్రులు ఎంఎల్ఏలు ఎలా రెచ్చిపోతారో మొన్నటి సమావేశాల్లో  చూసిందే.

 

అదే సమయంలో ఇప్పటికే పార్టీకి చెందిన చాలామంది ఎంఎల్ఏలు చంద్రబాబు ఆదేశాలను లెక్క చేయటం లేదు. ఒకవైపు సొంత ఎంఎల్ఏలే మద్దతు ఇవ్వక, మరో టిడిపి ఎంఎల్ఏనే తమపై ప్రయోగిస్తే చంద్రబాబు పరిస్ధితి గోవిందా...గోవిందానే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: