ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోటు చేసుకుంది. నవంబర్ 17వ తారీఖున చిల్డ్రెన్ థియేటర్ వద్ద ఇద్దరు పోలీసులు వాళ్ల డ్యూటీ నిమిత్తం థియేటర్ ఎదుట నిల్చొని ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక వ్యక్తి బాగా మందు సేవించి పోలీసుల కంటపడ్డాడు. దాంతో ఒక పోలీసు అతన్ని వారించే ప్రయత్నం చేశారు. ఫుల్ గా మందు తాగిన వ్యక్తి వెంటనే ఒక డమ్మి కత్తిని పట్టుకొని నన్నే తిడతావా.. పొడిచేస్తానంటూ కత్తితో వారించిన పోలీసును వెంబడించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ పోలీస్ కానిస్టేబుల్ పరిగెత్తాడు. తనతోపాటే ఉన్న ఇంకొక పోలీస్ కానిస్టేబుల్.. పరిగెత్తుతున్న కానిస్టేబుల్ సేఫ్ ఓ కాదో అని కొన్ని సెకన్లపాటు చూసి...ఆ తర్వాత అతను కూడా ఈ తాగుబోతు నుంచి తప్పించుకొని వేరొక వైపు పారిపోయాడు. 

 

ఈ తాగుబోతు సృష్టించిన బీభత్సం అంతా ఒక సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే ఈరోజు నవంబర్ 19వ తారీఖున ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోని 'ఏ ఎన్ ఐ' అనే ప్రైవేటు న్యూస్ ఏజెన్సీ ట్వీటర్ లో అప్లోడ్ చేసింది. 

 


అయితే సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఈ తాగుబోతు ని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మొన్న ఈ మధ్య నాగాలాండ్ కి చెందిన లిసా అనే మహిళ ఫుల్ గా మద్యం సేవించి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కింది. దాంతో ఆమెను పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అలా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన మహిళకు కాస్త మత్తు దిగిన తరువాత రెచ్చిపోయింది. పట్టుకోవడానికి ప్రయత్నించిన మహిళా పోలీసుల వేలు కొరికింది.  మెడపై రక్కింది.  ఈ రెండు సంఘటనలు చూస్తే మద్యం సేవించింది మగవాళ్ళు కావొచ్చు.. ఆడవాళ్లు కావొచ్చు కానీ వాళ్లు చేసే పనులు మాత్రం దారుణంగా ఉంటాయని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: