చంద్రబాబునాయుడులో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోందని సమాచారం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీని ఎలా తట్టుకోవాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదట. చంద్రబాబును ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

 

అదే సమయంలో మొన్నటి సమావేశాలతో పోల్చుకుంటే రేపటి సమావేశాల్లో సంఖ్యాపరంగా టిడిపి ఇంకా వీకైపోవటం ఖాయం. టిడిపికున్నదే 23 మంది ఎంఎల్ఏలు. వీళ్ళల్లో గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. అంటే ఇపుడున్నది 22 మంది ఎంఎల్ఏలు మాత్రమే. వీళ్ళల్లో కూడా  చంద్రబాబుకు అందరూ సహకరించటం లేదు.

 

వీలైనంతమంది బిజెపిలోకి దూకేద్దామని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది మంది ఎంఎల్ఏలు బిజెపిలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే.

 

మొన్న ఇసుక కొరత మీద చంద్రబాబు దీక్ష చేస్తే సుమారు 13 మంది హాజరుకాలేదు. మరో ముగ్గురు దీక్ష ప్రారంభంలో కనిపించి తర్వాత మాయమైపోయారట. మొదటి నుండి చివరవరకూ దీక్షలో ఉన్నది అచ్చెన్నాయుడు, రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే.

 

మొన్నటి ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నది రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి మాత్రమే. సభలో మిగిలిన సభ్యులు కనబడుతున్నా ఏ అంశంలో కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలవటం లేదు.

 

విశాఖనగరంలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు, ప్రకాశం జిల్లాలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏలతో పాటు అక్కడక్కడ గెలిచిన వారిలో అత్యధికులు సీనియర్ సభ్యుడు పయ్యావుల కేశవ్ తో కలిపి  సభలో దాదాపు మౌనంగానే ఉంటున్నారు.

 

సరే బావమరిది సభకు వచ్చేదే తక్కువ. వచ్చినా మాట్లాడడు. మాట్లాడినా ఎవరికీ అర్ధంకాదు. ఈ పరిస్ధితుల్లో ఇండిపెండెంట్ గా కూర్చోబోతున్న వల్లభనేని వంశీ కూడా చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారటం ఖాయం. కాబట్టి రాబోయే శీతాకాల సమావేశల్లో చంద్రబాబుకు టెన్షన్ పెరిగిపోవటం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: