హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్తున్న రైలులో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద శబ్ధం రావడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు అంత ఒక్కసారిగా ఏం జరిగింది అని భయాందోళనకు గురయ్యారు.  

 

పవర్‌ షట్‌డౌన్‌ కావడం వల్లే రైలు నిలిచిపోయిందని హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు తెలిపారు. అయితే ప్రాధమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే హైదరాబాద్ మెట్రో రైలులో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం కూడా వర్షం పడుతుంది అని అమీర్ పెట్ మెట్రో స్టేషన్ కింద నించున్న ఒక యువతి తలపై మెట్రో పెచ్చు పడి అక్కడిక్కడే మరణించింది. 

 

ఆతర్వాత పదిరోజులు కూడా అవ్వకముందే మరోసారి అదే మెట్రో స్టేషన్ లో జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద మెట్రో స్టేషన్ పైనుంచి ప్లాస్టిక్ పైప్ ఊడిపడింది. అయితే.. పైప్ పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో అప్పుడు కూడా ప్రమాదం తప్పింది. నిన్నటికి నిన్న కూడా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైల్ డోర్ మీద ఉన్న క్యాబిన్ ఊడి పడింది. 

 

ఇలా హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరోజు మెట్రో పెచ్చు.. మరో రోజు క్యాబిన్.. మరో రోజు పైపులు ఇలా రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏకంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్ని జరుగుతున్నప్పటికీ హైదరాబాద్ మెట్రో స్టేషన్ యాజమాన్యం ఎంతమాత్రం జాగ్రత్తలు వహించడంలేదు. 

 

జాగ్రత్తలు వహించడం మని.. గడిచిన నెలన్నర సమయంలో మెట్రోకు సుమారు 20 కోట్లకు పైగా అదనపు రాబడి లభించింది అని ప్రకటనలు చేస్తుంది. మా మెట్రోకీ రోజు రోజు ఆదరణ పెరుగుతోంది అని చెప్తుంది. మా సేవలు నచ్చడం వల్లే ఇలా ప్రయాణికులు వస్తున్నారు అని చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: