ఆంధ్రా ప్రదేశ్  మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బిజెపి నాయకులకు రగులుతుంది . తాజాగా తిరుపతిలో బీజేపీ నేతలు మంత్రి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కక్షలు పెంచేలా ఉన్నాయని.. డిక్లరేషన్ విషయంపై మంత్రి వ్యాఖ్యలు సరికావన్నారు. చట్టాలు చేసే మంత్రులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నాని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు.

 

దీనివలన హిందువులలో మతవిద్వేషాలు పెరగడానికి అవకాశం ఉంది వెంటనే కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిక్లరేషన్ అనేది ఎన్నో ఏళ్లగా వస్తున్న సంప్రదాయమని.. దానిని మార్చడం సంప్రదాయం కాదని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో దేవాలయాలలో ఉన్న అర్చక సంఘాలు మరియు హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

 

ఇంతకీ ఏంటీ వివాదం అంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని కొన్ని  ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై విపక్షాలు చాలా మండిపడుతున్నాయి దీంతో మంత్రి తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి.. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై వివాదంపై మంత్రి ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.

 

మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలినాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు కోరారు. అన్నివర్గాల మనోభావాలను కాపాడతానని సీఎం ప్రమాణ స్వీకారం చేశారన్న బీజేపీ నేతలు... తిరుమల ఆలయంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: