దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. మామూలుగానే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువ మొత్తంలో ఢిల్లీ రాష్ట్రంలో కాలుష్యం ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఆ తీవ్రత కాస్త పెరగడంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ వాయు కాలుష్యం తీవ్రత  కలిగిన రాష్ట్రంగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఢిల్లీ ప్రజలందరూ కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఢిల్లీ గాలిలో కనీస ప్రాణవాయువు కరువవడంతో ఢిల్లీ వాసులు అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అంతే కాకుండా ఎంతో మంది శ్వాస  సంబంధిత  వ్యాధులతో  కూడా బాధపడుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడం ఒక గౌరవంగా భావించే ఇతర రాష్ట్రాల...ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఢిల్లీకి వెళ్లాలంటేనే  ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

 ఢిల్లీలో పెరిగిన కాలుష్య తీవ్రత తో ఇప్పటికే విద్యాసంస్థలకు  సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు వాహనాల విషయంలో కూడా సరి బేసి సంఖ్య విధానం ఢిల్లీలో అమలు చేస్తుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. అయితే ఢిల్లీ నేడు మరో సమస్య ప్రజలను  బెంబేలెట్టించింది . నేపాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీ ఎన్సీఆర్  సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3 నమోదైనట్లు యూరోపియన్ మెడిటేరియన్ సెస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది. 

 

 

 

 నేపాల్లోని ధైలెక్ కు  87 కిలోమీటర్ల దూరంలో భూమి కి 14 కిలోమీటర్ల లోతులో  భూకంప కేంద్రం గుర్తించారూ  అధికారులు. రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో  సంబంధించిన అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో  కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలందరూ  భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఇదిలా ఉండగా ఢిల్లీలో  రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలందరూ ఢిల్లీలో నివసించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: