గత కొన్ని రోజుల నుంచి ఆవుపేడ కేకులు అన్న పేరు వింటూవస్తున్నాం .. ఇది ఈపాటికే అన్ని చోట్ల తెలిసేవుంటుంది. ఇప్పటికే దీనిని  మన దేశంలో  వీటి అమ్మకాలను అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి పెద్ద పెద్ద  సంస్థలు ఎప్పుడో ప్రారంభించాయి. అయితే ఆవు పేడ కేకులు ఇప్పుడు సరిహద్దులు కూడా దాటి విస్తరించింది. ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుకాణంలో ఆవుపేడతో చేసిన కేకులు అమ్మకానికి పెట్టారు. దీని ధర ఆన్‌లైన్‌ రేట్ల కన్నా మరీ తక్కువగా ఉన్నాయి. పది కేకులు రూ. 214కే  లభ్యమవుతాయి. దీనితో అక్కడ దుకాణానికి వచ్చిన జనం ఓసారి దాన్ని పూర్తిగా పరిశీలించాకే వెనుదిరుగుతున్నారు.

 

అయితే ఇక్కడ ఓ ముఖ్య గమనిక ఒకటి వుంది  ..ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏమిటంటే  ఈ ఆవు పేడ కేకులు తినడానికి మాత్రం కాదు అని దుకాణదారులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసము   మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. భారత ప్రోడక్ట్‌  అని ఈ విధంగా తయారైన  ఆవు పేడ కేకుల ప్యాకెట్‌పై రాసి ఉంది. దీన్ని ఫొటో తీసిన ఒక మహిళ ఆమె సోదరుడు సమర్‌ హలంకర్‌కు ఆన్ లైన్ లో  పంపించింది.

 

అతడు ఈ విషయాన్నీ  సోషల్‌ మీడియాలో పంచుకోవడంతోపాటు అతనికి తలెత్తిన ప్రశ్నను వెలిబుచ్చాడు. ‘ఇంతకీ ఇది మన దేశ  ఆవుల పేడతో చేసినవా? లేక విదేశీ సంబంధించిన  ఆవుల పేడతో చేసినవా?’ అని అనుమానపడ్డాడు. దీనికి నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ‘ఏముంది? అనుమానం నిజం చేసుకోవాలంటే అనుమానం వచ్చినవారు  ఈ  ఆవు  పేడ కేకులను కాస్త రుచి చూడండి.. నిజం ఏమిటో మీకే తెలుస్తుంది’ అంటూ ఓ నెటిజన్‌ దీనిపై ఉచిత సలహా ఇచ్చాడు.ప్రస్తుతం  సోషల్ మీడియా లో ఈ  సంఘటన బాగా వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: