ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీని ఒక ఆట ఆడేసుకుంటున్న అధికార వైసీపీకి మరో అస్త్రం దక్కింది. ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైన విషయం తెలిసిందే. ఆ పార్టీని వైసీపీ ముప్పుతిప్పలు పెట్టేస్తుంది. గతంలో తమని ఏ విధంగా ఆడుకుందో అంతకుమించి ఇప్పుడు టీడీపీని జగన్ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇక మధ్య మధ్యలో ఆ పార్టీ నేతలని లాగేసుకుంటూ ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తుంది. అయితే ఎన్నిరకాలుగా చేసిన టీడీపీ.. వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు మాత్రం ఆపలేదు.

 

పైగా ఎప్పటి నుంచో జగన్ పై ఉన్న కేసుల విషయాలని ప్రస్తావిస్తూ మరి కామెంట్లు చేస్తుంటారు. ఇక ఈ మధ్య ఈ కేసుల విషయంలో టీడీపీ నేతలు మరింత ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. జగన్ గజదొంగని, సీబీఐ చిటికేస్తే జగన్ జైలుకు వెళ్లిపోతారని మాట్లాడుతున్నారు. టీడీపీ చేసే అన్ని విమర్శలని సమర్ధవంతంగా తిప్పేకొట్టే వైసీపీ....ఈ కేసుల విషయంలో మాత్రం అంత ఎఫెక్టివ్ గా మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే వైసీపీకి సరైన అస్త్రం దక్కింది. 14 ఏళ్ళు క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు ఏ‌సి‌బి కోర్టు షాక్ ఇచ్చింది.

 

2005లో చంద్రబాబు ఎన్నికల అఫడవిట్ ఆధారంగా ప్రస్తుత వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కేసు వేసింది. అయితే అప్పుడు ఈ కేసులో విచారణ జరగకుండా బాబు దీనిపై స్టే తెచ్చుకున్నారు. ఇక సివిల్..క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదన సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు చంద్రబాబు కేసుపై స్టే ఎత్తేసిన ఏ‌సి‌బికోర్టు విచారణకు ఆదేశించింది. ఈ నెల 25న తదుపరి విచారణ చేపట్టనుంది.

 

ఇక ఈ కేసు రుజువు చేసేందుకు లక్ష్మీపార్వతి ఆధారాలు సమకూర్చుకుంటున్నారు. అటు వైసీపీ కూడా ఈమెకు సహకరించే అవకాశముంది. ఒకవేళ కేసు రుజువైతే బాబు కూడా దోషిగా నిలబడతాడు. అలా కాకుండా మళ్ళీ స్టే తెచ్చుకున్న నెగిటివ్ అవుతారు. ఏదేమైనా ఈ కేసు తేలేవరకు బాబుని వైసీపీ నేతలు ఆడుకోవడం ఖాయం. కొన్ని రోజులు టీడీపీ వాళ్ళు కూడా జగన్ కేసుల విషయంపై నోరెత్తలేరు కూడా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: