నాయకుడు పార్టీ మారినా....కేడర్ మాత్రం చెక్కుచెదర్లేదు. ఒక్క నాయకుడు పోతే వంద నాయకులని తయారు చేస్తా.... నేతలు టీడీపీని వీడిన ప్రతిసారి అధినేత చంద్రబాబు చెప్పే డైలాగులు ఇవే. అయితే బాబు చెప్పే మాటలు కేవలం డైలాగులు గానే మిగిలిపోతున్నాయి. తప్ప రియాలిటీలో అంత కనిపించడం లేదు. ఎందుకంటే నాయకుడు పార్టీని వీడిన ప్రతిసారి కేడర్ కూడా పార్టీని వీడుతుంది.

 

ఈ విషయం తెలంగాణలో బాగా అర్ధమవుతుంది. అక్కడ నేతలతో పాటు కేడర్ కూడా తుడిచిపెట్టుకునిపోవడంతో అక్కడ టీడీపీ కథ ముగిసిపోయింది. ఇక ఏపీలో ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి టీడీపీ పరిస్తితి ఘోరంగా మారిపోయింది. టీడీపీ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడంతో నేతలతో పాటే కేడర్ కూడా వెళ్లిపోతుంది. ఒకప్పుడు టీడీపీని నేతలు వీడిన కేడర్ గట్టిగా నిలబడటంతో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.

 

ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న గన్నవరంలో కేడర్ వల్లభనేని వంశీతో పాటే వెళ్ళడం ఖాయమని అంటున్నారు. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల తర్వాత వంశీ అధికారికంగా వైసీపీలో చేరే అవకాశముంది. అప్పుడు వంశీ తో పాటు టీడీపీకి అండగా నిలుస్తున్న కేడర్ కూడా వైసీపీలోకి వెళ్లొచ్చు.
ఎందుకంటే వంశీ గత పదేళ్లుగా గన్నవరంలో తనకంటూ ఓ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

 

ఇక ఎమ్మెల్యేగా కూడా బాగా పని చేయడం వల్లే, మొన్న ఎన్నికల్లో అంతటి వైసీపీలో గాలిలో కూడా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలవగలిగారు. దీంతో పూర్తిగా కాకపోయిన చాలావరకు టీడీపీ కేడర్ వంశీ వెనుకే నడిచే అవకాశముంది. ఇక ఆయన వైసీపీలోకి వెళితే...అటు వైసీపీ కేడర్, వంశీ వెనుక వచ్చిన కేడర్ తో ఉపఎన్నికల్లో గెలవడం కూడా సులువే అవుతుంది. ఇక కేదార వెళ్లిపోతే గన్నవరంలో టీడీపీ పుంజుకోవడం చాలా కష్టం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: