విలక్షణ నటుడు, ఎంఎన్‌ఎం(మక్కల్‌ నీది మయ్యమ్‌) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ తన చిరకాల స్నేహితుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరు ఒక్కటయ్యారు. ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా ? అదేనండి.. రజినీకాంత్, కమల్ హాసన్ గత 44 ఏళ్లుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. 

    

ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. రజినీకాంత్‌తో నా స్నేహం 44 ఏళ్లుగా కొనసాగుతోంది, మా స్నేహం ఇలాగే కొనసాగుతుంది.. కావాలంటే తమిళనాడు అభివృద్ధి కోసం తామిద్దరం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా కమల్‌ తెలిపారు. ఈ ఇద్దరు నటులు అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీ అయ్యారు. 

       

కమల్‌ హాసన్ ఎంఎన్‌ఎం పార్టీ స్థాపించి, గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా, పార్టీ ప్రకటించిన రజినీ.. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తమిళనాడులో ఏదైనా సమస్య ఎదురైతే.. తామిద్దరం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా కమల్‌ తెలిపారు. దీంతో ప్రస్తుతం కమల్ హాసన్, రజినికాంత్ అభిమానులు సోషల్ మీడియా వేధికగా కమల్ హాసన్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

           

అంతే కాదు ఈ ఇద్దరు స్నేహితులు.. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌షా హిందీ భాషను దేశంలోని ప్రతి రాష్ట్రంలో తప్పనిసరి చేస్తామని ప్రకటించినప్పుడు తీవ్రంగా కండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళ భాషను వదులుకునేది లేదని ఇద్దరు స్నేహితులు కరాఖండిగా చెప్పారు. దీంతో కేంద్రం కూడా ఈ విషయంపై వెనక్కి తగ్గింది.

 

కాగా నిన్నటికి నిన్న రజినీకాంత్ కూడా కమల్ హాసన్ కు మద్దతు ఇచ్చారు. అతని మాటలపై రాజకీయనాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అతను కూడా నిన్న మా స్నేహాన్ని ఎవరు విడకొట్టలేరు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: