ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే టీడీపీ అనుకూల మీడియా ప్రచురించిన కొన్ని కథనాలు... ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరం... జీతాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్ధిక పరిస్థితి అధికారులకు చుక్కలు చూపిస్తుంది, ఆమ్మో ఒకటో తారీఖు, చేతులు ఎత్తేస్తున్న అధికారులు... సీనియర్ అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి, రుణాలు ఇవ్వడానికి ఇష్టపడని బ్యాంకులు, ఓవర్ డ్రాఫ్ట్ కి కూడా వెళ్లే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు... ఈ తరహా కథనాలతో రాష్ట్ర ప్రజలను ఒక అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది.

 

సెలవలు వచ్చి ఒకటో తారీఖు పడాల్సిన జీతాలు ఆలస్యమైనా సరే, సాంకేతిక సమస్యలు ఉంటాయని కూడా ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు అని రాస్తూ వచ్చింది. దీనిని టీడీపీ సోషల్ మీడియా కూడా చక్కగా వాడుకుంది. కట్ చేస్తే ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. వాహన మిత్ర, రైతు భరోసా తో పాటు పెంచిన పింఛన్లు ఎక్కడా లోటు లేకుండా అందుతున్నాయి. జీతాలు కూడా అందరికి అందుతున్నాయి.

 

వాలంటీర్ల జీతాల విషయంలో ముందు ఇబ్బంది పడినా తర్వాత ప్రభుత్వం సమర్ధవంతం గానే చెల్లించింది. ఇక మరిన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే పనిలో జగన్ పడ్డారు. ఇక్కడే చంద్రబాబుకి ఒక షాక్ ఇచ్చారు జగన్ ఏ ఆర్ధిక పరిస్థితిపై అయితే తనకు అవగాహన లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారో... అదే ఆర్ధిక  పరిస్థితి నేడు సమర్ధవంతంగా నడిపిస్తున్నారు జగన్. తన పదవి నుంచి చంద్రబాబు దిగిపోయే కొన్ని రోజుల ముందు... రాష్ట్ర ఖజానాను సంక్షేమ పథకాల రూపంలో ఓట్లను కొనడానికి జనానికి పంచారు చంద్రబాబు.

 

కానీ ఆ సమస్య నుంచి బయటకు రావడానికి జగన్ సీనియర్ అధికారుల సహాయం, మాజీ ఆర్ధిక మంత్రుల సహాయం తీసుకుని గట్టిగా ప్రయత్నాలు చేసి నేడు ఈ స్థాయికి తీసుకొచ్చారు. చివరిగా ఆర్ధిక పరిస్థితి విషయంలో జగన్ ను తక్కువ అంచనా వేసిన చంద్రబాబుకి గట్టి షాక్ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: